- Telugu News Photo Gallery yoga poses these 5 yoga poses will help in increasing metabolism you will loss weight fast
Yoga Poses: మహిళలు వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ ఐదు యోగాసనాలు ట్రై చేయండి
Yoga Poses: చాలా మందిలో మెటబాలిజం రేటు చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, బరువు తగ్గడం చాలా కష్టం. బరువు తగ్గడానికి, జీవక్రియ రేటును పెంచడం అవసరం. మహిళల్లో కొన్ని యోగాసనాలు వేగంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి.
Updated on: Apr 17, 2022 | 3:19 PM

ఉస్త్రాసనం - దీనినే ఒంటె యోగా భంగిమ అని కూడా అంటారు. యోగా చాప వజ్రాసనంలో కూర్చోవాలి. అనంతరం కాలివేళ్లు, మడమల వంపు ఆధారంగా కూర్చొనవలెను. నడుము కింది భాగంలో వీలైనంత వెడల్పుగా ఉంచండి. శరీరం, వెన్నెముక, మెడ నిఠారుగా ఉంచాలి. అరచేతులను సంబంధిత మోకాళ్ల మీద ఆనించాలి. అనంతరం మోకాళ్ళ మీద నిలబడాలి. సుధీర్ఘ శ్వాస తీసుకుంటూ శరీరాన్ని తలను వెనుకకు తీసుకుని వెళ్ళాలి. చేతులను వెనుకకు తీసుకువెళ్ళి పాదములను పట్టుకొనవలయును. మోకాళ్లమీద శరీరాన్ని వెనుకకు వంచి కుడి మడమను మీ కుడి చేతితోనూ, ఎడమ మడమను ఎడమ చేతితోనూ పట్టుకోవాలి. దీర్ఘంగా శ్వాసను తీసుకోవాలి

శలభాసనం- ముందుగా రిలాక్స్ గా బోర్లా పడుకొని రెండు కాళ్ళను దగ్గరగా రెండు చేతులను తొడల క్రింద ఉంచాలి. 2. అనంతరం గడ్డం నేలపై ఆనించి, కొద్దిగా శ్వాస పీల్చి మొదట కుడికాలును మోకాలు వంచకుండా పైకి ఎత్తాలి. 3. ఈ పొజిషన్ లో కొన్ని క్షణాలున్న ఉండాలి.. అనంతరం మెల్లగా కాలు నేలమీదకు మెల్లగా దించాలి. 4. మళ్లీ కుడికాలు ఎత్తిన విధంగానే ఎడమకాలితో కూడా చేయాలి. 5 ఇలా ఒక్కక్క కాలితో మూడేసి సార్లు చేసిన తర్వాత రెండు కాళ్ళను కలిపి ఒక్కసారే పైకి ఎత్తాలి. కొంచెం సేపు ఈ విధంగా ఉండి.. మెల్లగా కిందకు దించాలి. ఇలా రెండు కాళ్లతో మూడుసార్లు చేయాలి. తర్వాత మకరాసనంలో కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలి.

సేతుబంధాసనం - నేలపై వెల్లకిలా పడుకోవాలి. 2. మోకాళ్లను వంచాలి. పాదాలు నేలపై ఆనించాలి. చేతులు రిలాక్స్‌డ్‌గా నేలను ఆనుకొని ఉండాలి. 3. ఇప్పుడు గట్టిగా శ్వాస పీల్చి వీపు భాగాన్ని పైకి లేపాలి. శరీర బరువు మొత్తం పాదాలు, భుజాలపై ఉండాలి. 4. చేతులు రెండింటిని ఒకదానితో ఒకటి పట్టుకోవాలి. ఎంతసేపు వీలైతే అంత సేపు ఈ భంగిమలో ఉండాలి. శ్వాసను నెమ్మదిగా వదలడం, తీసుకోవడం చేస్తుండాలి. 5. తరువాత నెమ్మదిగా సాధారణ స్థితిలోకి రావాలి.

త్రికోణాసనం - నిఠారుగా నిలబడి… శ్వాస పీలుస్తూ రిలాక్స్ గా విడవాలి. వెన్నెముకను నిఠారుగా నిలిపి.. రెండు కాళ్ళను వీలైనంత దూరంగా జరపాలి. రెండు చేతులను నిదానంగా పైకి లేపి .. భూమికి సమాంతరంగా ఉంచాలి. అనంతరం కుడి చేతిని కుడి పాదాన్ని తాకుతూ మెల్లగా శరీరాన్ని బెండ్ చేయాలి. ఇక అదే సమయంలో ఎడమ అరచేతిని పైకెత్తి నిటారుగా ఉంచాలి. తల ఎడమ అరచేతి వైపు తిప్పి దానిని చూస్తూ ఉండాలి. తర్వాత శ్వాసను నెమ్మదిగా పీలుస్తూ మళ్ళీ రిలాక్స్ అవ్వాలి. ఇక కుడి చేతివైపు ఏ విధంగా శరీరాన్ని వంచి చేశామో.. నెక్స్ట్ అదే విధంగా ఎడమ వైపు కూడా చేయాలి.

యోగా మ్యాట్‌పై మీ పాదాలను కొద్దిగా దూరంగా ఉంచి నిటారుగా నిలబడండి. మీ అరచేతులను తల మీద నుంచి నిటారుగా పెట్టండి. మోచేతులు వంగి ఉండకూడదు. అనంతరం మోకాళ్ళను వంచుతూ కుర్చీ పోజులోకి రండి. కళ్లను స్ట్రైట్ గా చూడాలి. నడుము నిటారుగా ఉండాలి. ఈ భంగిమలో కొంత సేపు ఉండండి.




