- Telugu News Photo Gallery World photos PM Modi hosted by King of Bhutan and his family for a private dinner see photos
PM Modi In Bhutan: భూటాన్ రాజకుటుంబీకులతో ప్రైవేట్ డిన్నర్లో పాల్గొన్న ప్రధాని మోదీ..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత రెండు రోజుల క్రితం భూటాన్ లో పర్యటించారు. అక్కడ దేశ ప్రధాని, రాజు ఆతిథ్యం స్వీకరించారు. అయితే తాజాగా భూటాన్ రాజకుటుంబీకులతో గడిపిన ప్రైవేట్ డిన్నర్ ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి.ఈ ఫోటోలలో ప్రధాని మోదీకి భూటాన్ రాజు లింగానా ప్యాలెస్ లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అక్కడ రాజ ధర్మపత్నితోపాటు వారి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలతో మోదీ సరదాగా ఆడుతూ, మాట్లాడినట్లు ఈ చిత్రాల్లో కనిపిస్తోంది.
Updated on: Mar 25, 2024 | 4:48 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత రెండు రోజుల క్రితం భూటాన్ లో పర్యటించారు. అక్కడ దేశ ప్రధాని, రాజు ఆతిథ్యం స్వీకరించారు. అయితే తాజాగా భూటాన్ రాజకుటుంబీకులతో గడిపిన ప్రైవేట్ డిన్నర్ ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి.

ఈ ఫోటోలలో ప్రధాని మోదీకి భూటాన్ రాజు లింగానా ప్యాలెస్ లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అక్కడ రాజ ధర్మపత్నితోపాటు వారి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలతో మోదీ సరదాగా ఆడుతూ, మాట్లాడినట్లు ఈ చిత్రాల్లో కనిపిస్తోంది.

భూటాన్ రాజు పిల్లలు కూడా ప్రధాని మోదీని తమ కుటుంబ సభ్యుల్లో ఒకరుగా భావించి చాలా సరదాగా గడుపుతూ కనిపించారు. దీనికంటే ముందు ఆక్కడి ప్రధాని మోదీకి స్వాగతం పలకడం, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం నరేంద్ర మోదీ మనసుకు హత్తుకున్నాయి.

అందుకే ఈ దేశాన్ని విడిచి స్వదేశానికి పయనమయ్యే క్రమంలో తన ట్విట్టర్ వేదికగా కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు. భూటాన్ పర్యటన తనకు చాలా ప్రత్యేకత అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. ఈ పర్యటన ద్వారా ఇరుదేశాల ద్వైపాక్షికత మరింత మెరుగుపడిందని తెలిపారు.

ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయం కట్టిపడేసిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ పర్యటనలో ఒక అద్భుతం ఆవిష్కృతం అయింది. మోదీకి భూటాన్ రాజు అత్యున్నత పౌర పురస్కారం అందించారు. ఇలా భూటాన్ అవార్డును పొందడం మన దేశం తొలిసారి. అలాగే ఈ పురస్కారం అందుకున్న తొలి విదేశీ పౌరునిగా మోదీ చరిత్రపుటల్లో నిలిచారు.
