- Telugu News Photo Gallery World photos Nasa artemis tests the space suit fabrics by firing ballistic air guns and mock meteorites to test its safesty here full details
చంద్రుడి పైకి మనుషులను పంపేందుకు ముమ్మర ప్రయత్నాలు.. సాంకేతికతపై ప్రత్యేక దృష్టి.. స్పేస్‌సూట్‌లను ఎలా పరీక్షిస్తుందంటే..
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చంద్రుడి పైకి మరోసారి మనుషులను పంపేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే ప్రస్తుతం ఇందుకోసం ప్రత్యేకంగా సాంకేతికతపై దృష్టి సారించింది. ఆ వివరాలెంటో తెలుసుకుందామా..
Updated on: Sep 18, 2021 | 1:41 PM

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరోసారి మనుషులను చంద్రుడిపైకి తీసుకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. అయితే మనుషులను పంపడానికి ముందు నాసా.. ప్రస్తుతం ఉన్న సాంకేతికతను పరిక్షీంచే పనిలో నిమగ్నమై ఉంది. అంతరిక్ష పదార్థాల శక్తిని పరీక్షించడానికి నాసా 40 అడుగల పొడవున్న ఎయిర్ గన్ను సిద్దం చేసింది.

బర్డ్ స్ట్రైక్స్ నుంచి బాలిస్టిక్ ఎఫెక్ట్స్ వరకు విమానాలను పరీక్షించడానికి ఎయిర్ గన్స్ ఉపయోగిస్తారు. అయితే వ్యోమగాములు అంతరిక్షానికి వెళ్తారు.. అక్కడి నుంచి చంద్రునిపైకి వెళ్తారు. అందుకే ప్రతి చిన్న రాతి లేదా లోహపు కణాలు గంటకు 22 వేల మైళ్ల వేగంతో విశ్వంలో తిరుగుతుంటాయి. అందుకే అక్కడకు మనుషులను పంపించడానికి ముందు అన్ని రకాల తనీఖీలు చేయడం చాలా ముఖ్యం.

గ్లెన్ రీసెర్చ్ సెంటర్ యొక్క బాలిస్టిక్ ఇంపాక్ట్ ల్యాబ్ నుంచి కొందరు ఇంజనీర్లు భవిష్యత్తులో ఆర్టెమిస్ మిషన్ల కోసం స్థిరమైన మెటీరియల్స్ ఎంచుకున్నారని.. అవి చంద్రుని ఉపరితలంపై ఎలా పనిచేస్తాయో నిర్ధారించడానికి పని చేస్తున్నాయి.

అక్కడ ఇళ్లను తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలను బృందం అంచనా వేస్తోంది. ఇవి మృదువుగా, సౌకర్యవంతంగా ఉండేలా రూపొందిస్తున్నారు. వివిధ వస్త్రాల స్టీల్ బాల్ బేరింగ్‌లను కాల్చడానికి ఇంజనీర్లు ఎయిర్‌గన్‌లను ఉపయోగిస్తున్నారు.

శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఈ ఎయిర్ గన్ తో చెక్ చేస్తున్నారు. వ్యోమగాములు బయటి వాతావరణంలో పనిచేసినప్పుడు, వారిని సురక్షితంగా ఉంచడానికి సూట్ రెడీ చేయడానికి ఎలాంటి మెటీరియల్ సిద్ధం చేయాలనేదానిపై పరీశోధనలు నిర్వహిస్తున్నారు. అందుకు కావాల్సిన అసలైన మెటీరియల్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది వ్యోమగాముల శరీరంలోకి మైక్రోమీటర్ రాకుండా నిరోదించేలా చూసుకుంటారు.

చంద్రుడి పై ఉండే వాతావరణంలో ఎయిర్‌గన్‌లు ఉపయోగిస్తున్నారు. అవి వేగంగా అక్కడ పనిచేస్తాయి. ఇక అదే సమయంలో సెన్సార్లు, హై-స్పీడ్ కెమెరాల ద్వారా ఏ పదార్థం ఎంత శక్తిని గ్రహిస్తుందో కొలుస్తారు. దీని ద్వారా ప్రతి మెటీరియల్ యొక్క బలం పరీక్షించబడుతుంది.

ఎయిర్‌గన్ ద్వారా పరీక్షించిన పదార్థాలు స్పేస్‌సూట్‌లను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాల నుండి ఇతర వాహనాలను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాల వరకు ఉన్నాయని నాసా తెలిపింది. వ్యోమగాముల భద్రతకు పదార్థంకు ఉంటే బలం చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలు తెలిపారు.





























