ప్రపంచంలో అత్యంత అందమైన కోటలివే.. లిస్టులో రాజస్థాన్ ప్యాలెస్ కూడా ఉందండోయ్.. ఫొటోలు చూస్తే వావ్ అంటారు
పురాతన కోటలు, ప్యాలెస్‌ల గురించి మనం పుస్తకాల్లో చదివి ఉంటాం. సినిమాల్లో మాత్రమే చూసి ఉంటాం. ఈక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అలాంటి కొన్ని ప్యాలెస్‌లు, కోటల అందాలపై ఓ లుక్కేద్దాం రండి.
Updated on: Jan 16, 2023 | 1:09 PM

పురాతన కోటలు, ప్యాలెస్‌ల గురించి మనం పుస్తకాల్లో చదివి ఉంటాం. సినిమాల్లో మాత్రమే చూసి ఉంటాం. ఈక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అలాంటి కొన్ని ప్యాలెస్‌లు, కోటల అందాలపై ఓ లుక్కేద్దాం రండి.

థాయ్‌లాండ్‌లోని గ్రాండ్ ప్యాలెస్‌లో పలు భవనాలున్నాయి. 2,351,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కోటను నిర్మించారు. 1782లో నిర్మించిన ఈ ప్యాలెస్ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.

రొమేనియాలోని బ్రేన్ ప్యాలెస్‌ను డ్రాక్యులా కోట అని కూడా పిలుస్తుంటారు. పచ్చని చెట్ల మధ్య కొలువై ఉన్న ఈ కోటను చూడడానికి పర్యాటకులు పోటెత్తుతుంటారు.

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని అంబర్ కోట రాజపుత్ర వాస్తుశిల్పానికి చక్కని ఉదాహరణ. దీనిని ఇసుక, పాలరాయితో నిర్మించారు. పున్నమి వెన్నెల్లో ఈ కోటను చూస్తుంటే కనుల విందుగా అనిపిస్తుంది.

స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ కోట బ్రిటిష్ రాజ కుటుంబానికి చెందిన ప్రముఖ ప్యాలెస్‌లలో ఒకటిగా పేర్కొంటారు. క్రాతీ గ్రామానికి సమీపంలో ఉన్న ఈ కోటను1856లో నిర్మించారు.