- Telugu News Photo Gallery Winter skin care: Try this Winter Face Pack For Glowing Skin before going to sleep at night
Winter Skin Care: రాత్రిపూట నిద్రకు ముందు ఈ ఫేజ్ ప్యాక్ ట్రే చేశారంటే..
శీతాకాలం ప్రారంభమైంది. రాత్రి పూట, తెల్లవారుజామున చల్లని గాలులు వీస్తున్నాయి. సాధారణంగా శీతాకాలం ప్రారంభమైందంటే జలుబు, దగ్గుతో పాటు చేతులు, కాళ్ళు పొడిబారడం జరుగుతుంది.వాతావరణ మార్పు ప్రభావం చర్మంపై కూడా ఉంటుంది. కాలుష్యం వల్ల చర్మం పొడిబారుతుంది. చలికాలంలో ఈ సమస్య మరింత పెరుగుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇంట్లోనే సులువుగా తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ ట్రై చేయండి..
Updated on: Nov 01, 2023 | 2:56 PM

శీతాకాలం ప్రారంభమైంది. రాత్రి పూట, తెల్లవారుజామున చల్లని గాలులు వీస్తున్నాయి. సాధారణంగా శీతాకాలం ప్రారంభమైందంటే జలుబు, దగ్గుతో పాటు చేతులు, కాళ్ళు పొడిబారడం జరుగుతుంది.

వాతావరణ మార్పు ప్రభావం చర్మంపై కూడా ఉంటుంది. కాలుష్యం వల్ల చర్మం పొడిబారుతుంది. చలికాలంలో ఈ సమస్య మరింత పెరుగుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇంట్లోనే సులువుగా తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ ట్రై చేయండి.

ఓ గిన్నెలో రెండు స్పూన్ల మైదా తీసుకుని అందులో అర చెంచా పసుపు కలుపుకోవాలి. అందులో ఒక స్పూన్ తేనె, నెయ్యి కలుపుకోవాలి. అందులో ఒక స్పూన్ పెరుగు, పాలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ యాంటీ ఏజింగ్‌లా పనిచేస్తుంది. ఇది స్కిన్ ఇన్ఫెక్షన్‌ను కూడా నివారిస్తుంది. అలాగే చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.

ఈ ప్యాక్‌ను అప్లై చేసిన తర్వాత 20-25 నిమిషాల పాటు ఇలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే సరి.

ఆ తర్వాత ముఖాన్ని శుభ్రమైన టవల్‌తో శుభ్రం చేసుకుని, ముఖానికి నైట్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. నైట్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలంటే.. ఒక స్పూన్ కొబ్బరి నూనె, గ్లిజరిన్, విటమిన్ ఇ క్యాప్సూల్ వేసి కలుపుకుంటే నైట్ క్రీమ్ రెడీ అయినట్లే. ఒక రోజు తయారు చేసి ఫ్రిజ్‌లో ఉంచితే 5 రోజుల వరకు దీనిని ఉపయోగించవచ్చు. ఈ నైట్ క్రీమ్ ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గు ముఖం పడతాయి. అంతేకాకుండా ముఖం సహజకాంతితో వెలిగిపోతుంది.




