- Telugu News Photo Gallery Winter Health Care: Is It Safe To Take A Bath When You Are Down With Fever
Health Care Tips: జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయొచ్చా? ఒకవేళ స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
విభిన్న వాతావరణ పరిస్థితిల వల్ల త్వరగా జబ్బుపడటం జరుగుతుంది. ప్రస్తుతం పగటిపూట వేడి, రాత్రి చల్లగా ఉంటుంది. మరోవైపు వాయు కాలుష్యం కూడా పెరుగుతోంది. వీటి అన్నింటి వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.ఇలాంటి వాతావరణం వల్ల వైరల్ ఫీవర్ దాడి చేస్తుంది. దీనివల్ల జ్వరం, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, నీరసం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.మరోవైపు డెంగ్యూ జ్వరాలు కూడా విజృంభిస్తున్నాయి. జ్వరం వస్తే చాలా..
Updated on: Nov 01, 2023 | 3:17 PM

విభిన్న వాతావరణ పరిస్థితిల వల్ల త్వరగా జబ్బుపడటం జరుగుతుంది. ప్రస్తుతం పగటిపూట వేడి, రాత్రి చల్లగా ఉంటుంది. మరోవైపు వాయు కాలుష్యం కూడా పెరుగుతోంది. వీటి అన్నింటి వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఇలాంటి వాతావరణం వల్ల వైరల్ ఫీవర్ దాడి చేస్తుంది. దీనివల్ల జ్వరం, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, నీరసం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.

మరోవైపు డెంగ్యూ జ్వరాలు కూడా విజృంభిస్తున్నాయి. జ్వరం వస్తే చాలా మంది స్నానానికి దూరంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో స్నానం చేస్తే, సమస్య మరింత తీవ్రమవుతుందనే చాలా మంది అపోహపడుతుంటారు.

అయితే జ్వరం వస్తే స్నానం చేయాల్సిన అవసరం చేయొచ్చే.. లేదో.. అనే విషయం చాలా మందికి తెలియదు. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.. జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తినప్పుడు ప్రతిరోజూ స్నానం చేయాలి. రోజుకు ఒకట్రెండు సార్లు స్నానం చేసినా ఎలాంటి హాని జరగదు. నిజానికి, జ్వరం సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గాలంటే స్నానం తప్పనిసరిగా చేయాలి. అవసరమైతే తల స్నానం కూడా చేయొచ్చు.

అలాగే జ్వరం నుంచి ఉపశమనం పొందడానికి మెడిసిన్ కూడా తీసుకోవాలి. జ్వరంతోపాటు జలుబు-గొంతు నొప్పి వంటి సమస్యలు ఉంటే డాక్టర్‌ని సంప్రదించాలి. సరైన ఆహారం కూడా తీసుకోవాలి. ఈ సమయంలో రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడానికి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. చేపలు, గుడ్లు, మాంసం, పండ్లు, కూరగాయలు వంటి ఆహారాల్లో విటమిన్ 'సి' అధికంగా ఉంటుంది.





























