AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే స్టేషన్‌లో ఈ ఎల్లో లైన్స్ ఎందుకు ఉంటాయి.. 99శాతం ప్రయాణికులకు తెలియని సీక్రెట్!

మనలో చాలా మంది తరచూ రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లకు వెళ్తుంటారు. అయితే అక్కడి ప్లాట్‌ఫామ్‌లపై పసుపు రంగు గీతలు ఉండటాన్ని మీరెప్పుడైనా గమనించారా? ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు వీటిపై నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. అసలు ఈ గీతలను ఎందుకు గీశారు? వీటి వల్ల ఉపయోగం ఏమిటని మీరెప్పుడైనా ఆలోచించారా? ప్లాట్‌ఫామ్‌లపై ఈ పసుపు రంగు గీతలు ఎందుకు ఉంటాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Oct 19, 2026 | 5:09 PM

Share
సాధారణంగా ప్రతి రైల్వే, మెట్రో స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై ఈ పసుపు గీతలు కనిపిస్తాయి. రైలు వచ్చే సమయంలో ప్లాట్‌ఫామ్‌పై ఎంతవరకు సురక్షితమైన ప్రదేశమో సూచించేందుకే ఈ పసుపు లైన్‌ను గీస్తారు. ప్లాట్‌ఫామ్ అంచుకు, ఈ గీతకు మధ్య దూరం సాధారణంగా 1.8 మీటర్ల వరకు ఉంటుంది. అయితే ప్లాట్‌ఫామ్ డిజైన్, స్టేషన్ నిర్మాణాన్ని బట్టి కొన్ని స్టేషన్లలో ఈ దూరంలో మార్పులు ఉండవచ్చు.

1 / 5
పసుపు రంగునే ఎందుకు ఉపయోగిస్తారు?: మిగతా రంగులతో పోలిస్తే పసుపు రంగు చాలా దూరం నుంచే స్పష్టంగా కనిపిస్తుంది. స్టేషన్‌లో ఎంత రద్దీ ఉన్నప్పటికీ ప్రయాణికులు ఈ లైన్‌ను సులభంగా గుర్తించగలుగుతారు. రైలు వల్ల ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా, వారిని సురక్షితమైన దూరంలో ఉంచడమే ఈ పసుపు గీత ముఖ్య ఉద్దేశం.

2 / 5
రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు రైలు వచ్చి ఆగేంత వరకు ఈ పసుపు గీతను దాటకూడదు. అలా కాకుండా లైన్‌ను దాటి అంచున నిలబడటం చాలా ప్రమాదకరం. ఎందుకంటే రైలు వేగంగా ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చినప్పుడు బలమైన గాలి వీస్తుంది. ఆ గాలి ఒత్తిడి కారణంగా ప్రయాణికులు అదుపుతప్పి ట్రాక్‌పై పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎల్లో లైన్ దాటవద్దని రైల్వే సిబ్బంది హెచ్చరిస్తుంటారు.

3 / 5
కొన్ని స్టేషన్లలో ఈ ఎల్లో లైన్స్ వద్ద చిన్న ఉబ్బెత్తు చుక్కలు లేదా పొడవైన పట్టీలు ఉండటాన్ని గమనించవచ్చు. ఈ ప్రత్యేక అమరికను 'టాక్టైల్ పేవింగ్' అంటారు. దృష్టిలోపం ఉన్నవారు, అంధులు ప్లాట్‌ఫామ్‌పై సురక్షితంగా నడిచేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. వారు ఈ గీత వద్దకు రాగానే ఆ ఉబ్బెత్తు నిర్మాణాలు వారి పాదాలకు లేదా చేతి కర్రలకు తగులుతాయి. దాంతో అది ప్రమాదకరమైన అంచు అని, సురక్షితమైన పరిమితి ముగిసిందని వారు సులభంగా గుర్తిస్తారు.

4 / 5
చాలామంది వీటిని సాధారణ డిజైన్ అనుకుంటారు. కానీ ఇవి ప్రయాణికుల రక్షణ, భద్రత కోసం చేసిన కీలకమైన ఏర్పాట్లు. కాబట్టి ఇకపై మీరు ఎప్పుడైనా రైల్వే లేదా మెట్రో స్టేషన్‌కు వెళ్లినప్పుడు రైలు ఆగేంత వరకు ఈ పసుపు గీతను దాటకుండా వెనుకే నిలబడండి. ఈ భద్రతా నియమాన్ని మీరు పాటిస్తూ తోటి ప్రయాణికులకు కూడా తెలియజేయండి.

5 / 5
Follow Us