Vande Bharat Sleeper: మన వందే భారత్ స్లీపర్ ముందు చైనా బుల్లెట్ ట్రైన్ కూడా జుజూబీ.. 5 స్టార్ హోటల్ అనుభూతి..
వందే భారత్ రైళ్లకు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వందే భారత్ స్లీపర్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తొలి రైలు హౌరా-గువహతి మధ్య నడుస్తోండగా.. త్వరలో మరిన్ని రైళ్లను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టనున్నారు. అయితే వందే భారత్ రైలులోని సౌకర్యాల గురించి ఒక ట్రావెలర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను హౌరా-గువహతి మధ్య రైల్వేశాఖ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో రైలు ప్రారంభించగా.. రాత్రిపూట ప్రయాణించేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ట్రైన్‌లో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. విమానం తరహాలో లగ్జరీ సదుపాయాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. అత్యాధునిక వాష్ రూమ్స్, సీసీ కెమెరాలు, సెన్సార్ డోర్లు వంటివి ఉంటాయి. దీంతో పాటు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉన్నాయి. అయితే ఓ ట్రావెల్ క్రియేటర్ చైనా బల్లెట్ ట్రైన్‌తో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను పోల్చడం ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ట్రావెల్ క్రియేటర్ దేబాజిత్ దాస్ తాజాగా హౌరా-గువహతి వందే భారత్ స్లీపర్ రైల్లో ప్రయాణం చేశారడు. ఈ ట్రైన్‌ను 5 స్టార్ హోటల్‌గా అభివర్ణించిన అతడు.. చైనా బుల్లెట్ ట్రైన్‌తో దీనిని పొల్చాడు. చైనాలోని బుల్లెట్ రైళ్లకు తీసిపోని విధంగా ఇది ఉందని అభిప్రాయపడ్డాడు.
వందే భారత్ స్లీపర్ రైలులోని వాష్ రూమ్స్, సీటింగ్ ఏర్పాట్లు, భోజన సుదుపాయం, ఇతర సౌకర్యాలను ప్రశంసించిన అతడు.. వీడియో షూట్ చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ట్రైన్ లోపల ఉన్న సౌకర్యాలను చూపించాడు. ట్రైన్‌లోని వాష్ రూమ్ విశాలంగా, పరిశుభ్రంగా ఉన్న విషయంపై ప్రశంసలు కురిపించాడు. రాత్రిపూట ప్రయాణించేవారికి వాష్ రూమ్ సౌకర్యం కీలమమని వీడియోలో తెలిపాడు. ఇక రైల్లో ప్రదేశాలను శుభ్రపర్చడానికి యూపీ-సి దీపాలు ఉన్నాయి. భద్రత కోసం ఏరోసోల్ ఆధారిత అగ్ని ప్రమాద గుర్తింపు, ఆర్పివేత వ్యవస్థ ఉన్నాయి. ట్రైన్ ఎక్కగానే వాటర్ బాటిల్ అందించడం, ఆ తర్వాత భోజనం పెట్టడం వంటివి వీడియోలో చూపించారు. తనకు నాన్ వెజ్ భోజనం పెట్టారని, వెజిటేరియన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని తెలిపాడు.
అయితే వందే భారత్ స్లీపర్ రైలులోని సౌకర్యాలను భారతీయుడు ప్రశంసించడం కాదు. గతంలో విదేశీయులు కూడా ఇందులో ప్రయాణించి సౌకర్యాలను చూసి ఆశ్చర్యపోయారు. ఈ మేరకు తమ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు. ఇందులో ప్రయాణం అద్బుతంగా ఉందని వివరించారు. కాగా రాత్రిపూట సదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు వందే భారత్ స్లీపర్ రైళ్లను తీసుకొచ్చారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లలో కేవలం కూర్చునే బెర్త్‌లు ఉండగా.. స్లీపర్ రైలులో నిద్రపోవడానికి బెర్త్‌లు ఉంటాయి. ఇంతేకాకుండా ఆటోమేటిక్ ప్యాసింజర్ డోర్లు, సీసీటీవీ కెమెరాలతో పాటు స్వదేశీ కవచ్ వ్యవస్థ వంటి ఉంటాయి.
View this post on Instagram
