AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anaya Bangar: అయ్యర్‌ను చంపుతా.. అభిషేక్ శర్మను పెళ్లి చేసుకుంటానన్న అనయా బంగర్

Anaya Bangar: భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయా బంగర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్‌లలో ఎవరిని పెళ్లి చేసుకుంటానని, ఎవరిని ఎంచుకుంటానని అడిగిన ప్రశ్నకు ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

Anaya Bangar: అయ్యర్‌ను చంపుతా.. అభిషేక్ శర్మను పెళ్లి చేసుకుంటానన్న అనయా బంగర్
Anaya Bangar
Rakesh
|

Updated on: Oct 19, 2026 | 4:53 PM

Share

Anaya Bangar: భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయా బంగర్ మరోసారి వార్తల్లో నిలిచారు. టీమిండియా ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్‌ల గురించి ఆమె ఇచ్చిన సమాధానానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కృష్ణాంక్ అత్రే యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా అనయాను కిల్, మ్యారీ, హుక్‌అప్ అనే సరదా గేమ్ ఆడాలని అడిగారు. ఈ గేమ్‌లో ముగ్గురు వ్యక్తుల్లో ఒకరిని తొలగించడం, మరొకరిని పెళ్లి చేసుకోవడం, ఇంకొకరితో డేటింగ్ తరహా సంబంధాన్ని ఎంచుకోవడం వంటి ఊహాత్మక ఎంపికలు ఉంటాయి. దీనికి అనయా ఇచ్చిన సమాధానం క్రికెట్ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ గేమ్‌లో శ్రేయస్ అయ్యర్‌ను కిల్ ఆప్షన్‌లో, అభిషేక్ శర్మను మ్యారీ ఆప్షన్‌లో, శుభ్‌మన్ గిల్‌ను హుక్‌అప్ ఆప్షన్‌లో అనయా ఎంచుకున్నారు. దీంతో ఆమె సమాధానం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ముగ్గురు ఆటగాళ్ల పేర్లు ఒకే వీడియోలో రావడంతో క్రికెట్ అభిమానులు ఈ క్లిప్‌ను విపరీతంగా షేర్ చేస్తున్నారు.

అనయా బంగర్ భారత మాజీ క్రికెటర్, కోచ్ సంజయ్ బంగర్ కుమార్తె. గతంలో ఆమె ఆర్యన్ బంగర్ పేరుతో గుర్తింపు పొందారు. ముంబై వయోపరిమితి క్రికెట్‌లో ఆడిన అనుభవం ఆమెకు ఉంది. సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ వంటి ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడారు. లింగ మార్పిడి తర్వాత కూడా క్రికెట్‌లో కొనసాగాలనే తన ఆశను అనయా పలుమార్లు వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యక్తిగత ప్రయాణంతో పాటు క్రికెట్‌లో తిరిగి అవకాశాలు పొందాలనే ప్రయత్నం కూడా చర్చకు వస్తోంది.

ఇది కూడా చదవండి: IND vs NZ: భారత్ వర్సెస్ కివీస్ తొలి టీ20 మ్యాచ్.. ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి స్టార్ ప్లేయర్ అవుట్ ?

లింగ మార్పిడి శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత అనయా తన క్రికెట్ కెరీర్ ముగిసిపోయిందని తీవ్రంగా ఆవేదన చెందారు. మహిళల క్రికెట్ ఆడేందుకు అర్హురాలినంటూ బీసీసీఐని సంప్రదించినా ఎలాంటి సానుకూల స్పందన లభించలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ట్రాన్స్‌జెండర్ క్రీడాకారిణులపై కొన్ని కఠినమైన నిబంధనలు విధించడంతో వృత్తిపరమైన ఎలైట్ క్రికెట్ ఆడటం ఆమెకు పెద్ద సవాల్‌గా మారింది. అయినప్పటికీ ఆటపై ఉన్న అమితమైన ప్రేమతో ఆమె వెనకడుగు వేయలేదు.

కష్టకాలంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అనయా కలకు అండగా నిలిచింది. ఆస్ట్రేలియాలో కమ్యూనిటీ క్రికెట్ లేదా క్లబ్ క్రికెట్ ఆడేందుకు ఆమెకు అధికారికంగా వెసులుబాటు లభించింది. భవిష్యత్తులో మహిళా బిగ్ బాష్ లీగ్ ఆడే ఆలోచనలో ఆమె ఉన్నారు. ఈ కష్టసమయంలో తండ్రి సంజయ్ బంగర్ ఆమె వెన్నంటి నిలిచి పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఆట పట్ల ఆమె చూపిన పట్టుదల ఎంతోమందికి స్ఫూర్తినిచ్చేలా ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us