AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: భారత్ వర్సెస్ కివీస్ తొలి టీ20 మ్యాచ్.. ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి స్టార్ ప్లేయర్ అవుట్ ?

IND vs NZ: భారత క్రికెట్ జట్టు త్వరలో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా సుదీర్ఘ సిరీస్‌లో తలపడనుంది. ఇందులో భాగంగా తొలి టీ20 మ్యాచ్ అక్టోబర్ 22న క్రైస్ట్చర్చి వేదికగా జరగనుంది. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌ను రెండు చొప్పున డ్రా చేసుకున్న టీమిండియా ఇప్పుడు పూర్తిగా భిన్నమైన పరిస్థితుల్లో కివీస్‌తో పోరాడేందుకు సిద్ధమవుతోంది.

IND vs NZ: భారత్ వర్సెస్ కివీస్ తొలి టీ20 మ్యాచ్.. ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి స్టార్ ప్లేయర్ అవుట్ ?
Bhuvneshwar Kumar
Rakesh
|

Updated on: Oct 19, 2026 | 3:07 PM

Share

IND vs NZ: భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ అక్టోబర్ 22న క్రైస్ట్‌చర్చ్‌లో ప్రారంభం కానుంది. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్ 2-2తో సమంగా నిలిచింది. చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇప్పుడు న్యూజిలాండ్ పరిస్థితులకు తగ్గట్టుగా టీమిండియా తన ప్లేయింగ్ ఎలెవన్‌ను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. ఈ సిరీస్‌లో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత భారత టీ20 జట్టులోకి వచ్చిన భువీకి తొలి మ్యాచ్‌లోనే అవకాశం దక్కుతుందా? ఒకవేళ ఆడితే ఎవరిని పక్కన పెడతారు? అనే చర్చ మొదలైంది.

స్వింగ్ బౌలింగ్‌తో భువీకి కలిసొచ్చే అవకాశాలు

భువనేశ్వర్ కుమార్ చివరిసారిగా 2022 నవంబర్‌లో న్యూజిలాండ్‌తోనే అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు అదే దేశంలో మళ్లీ ఆడే అవకాశం రావడం ఆసక్తికరంగా మారింది. కొత్త బంతితో స్వింగ్ రాబట్టడంలో భువీకి మంచి పేరుంది. న్యూజిలాండ్ పరిస్థితుల్లో అతడి అనుభవం భారత జట్టుకు ఉపయోగపడొచ్చు. అయితే వెస్టిండీస్‌తో చివరి టీ20 కోసం జట్టులోకి వచ్చినా, వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ఒక్క బంతి కూడా వేయలేకపోయాడు. కాబట్టి తొలి టీ20లో అతడిని ఆడించాలా? లేదా ఇతర పేసర్లకు అవకాశం ఇవ్వాలా? అన్నది టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించాల్సి ఉంది.

ఎక్కువమంది చదివినది: జస్ట్ 6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. యూవీ 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్..

టాప్ ఆర్డర్‌లో మార్పులు కష్టమే

భారత బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు కీలకంగా ఉండనున్నారు. అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, నమన్ ధీర్ వంటి ఆల్‌రౌండర్లతో జట్టుకు బ్యాటింగ్ లోతు పెరుగుతుంది. అందుకే బ్యాటింగ్ విభాగంలో పెద్ద మార్పులు చేసే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. అయితే తుది జట్టులో ఎవరెవరు ఉంటారన్నది పిచ్ పరిస్థితులు, ఆటగాళ్ల ఫామ్, జట్టు బ్యాలెన్సింగ్ పై ఆధారపడి ఉంటుంది. వైభవ్ సూర్యవంశీకి కూడా జట్టులో చోటు ఉన్న నేపథ్యంలో అతడికి అవకాశం దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతుందా?

న్యూజిలాండ్ పిచ్‌లపై పేస్ బౌలర్లకు అనుకూల పరిస్థితులు ఉంటే భారత్ నలుగురు ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్లతో ఆడే అవకాశం ఉంది. అలా జరిగితే భువనేశ్వర్ కుమార్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లలో కొందరికి అవకాశం దక్కొచ్చు. నితీశ్ కుమార్ రెడ్డి కూడా పేస్ బౌలింగ్ చేయగలగడం జట్టుకు అదనపు బలం. అయితే మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ ఇద్దరినీ ఆడిస్తారా? లేక అనుభవానికి ప్రాధాన్యం ఇస్తూ భువీని ఎంపిక చేస్తారా? అన్నది చూడాలి. తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లకు బదులుగా ఇద్దరినే తీసుకుంటే మరో పేసర్‌కు స్థానం కల్పించడం సులభమవుతుంది.

ఇది కూడా చదవండి: Rinku Singh: ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన రింకూ సింగ్.. టాప్ 10లో చోటు

నమన్ ధీర్‌కు ముప్పు ఉందా?

భువనేశ్వర్‌ను ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తే నమన్ ధీర్ స్థానం ప్రమాదంలో పడొచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. నమన్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగల ఆల్‌రౌండర్ కావడంతో అతడిని తప్పించడం అంత సులభం కాదు. మరోవైపు మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లలో ఒకరిని పక్కన పెట్టి భువీకి అవకాశం ఇచ్చే ఆలోచన కూడా ఉండొచ్చు. ప్రస్తుతం ఇవన్నీ అంచనాలు మాత్రమే. అధికారిక ప్లేయింగ్ ఎలెవన్‌ను టాస్‌కు ముందు ప్రకటిస్తారు. అక్టోబర్ 22న జరిగే తొలి టీ20లో భువీకి అవకాశం దక్కుతుందా? ఒకవేళ ఆడితే ఎవరు బెంచ్‌కు పరిమితమవుతారు? అన్నది మ్యాచ్ రోజునే స్పష్టమవుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us