Papaya: పోషకాల పవర్ హౌస్ బొప్పాయి.. ఎప్పుడు తింటే మంచిదంటే..
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఎవరూ పెద్దగా తీసుకోరు. ఒక్కో టైమ్‌లో ఒక్కో పండు తింటే ఉండే లాభాలే వేరు. ఇలా మీకు మేలు చేసే వాటిల్లో బొప్పాయి కూడా ఒకటి. బొప్పాయితో ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ప్రతి రోజూ ఉదయం బొప్పాయిని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో కొద్దిగా తీసుకున్నా చాలా మంచిది. దీని వల్ల మీ ఆరోగ్యంతో పాటు చర్మ అందం కూడా పెరుగుతుంది. జీర్ణ సమస్యలు, మలబద్ధకం సమస్యలతో..
Updated on: Oct 15, 2024 | 6:49 PM

బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నా వారికి బొప్పాయి బెస్ట్ రెమిడీగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయి జీవక్రియను పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. బొప్పాయి క్యాన్సర్ వంటి తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

ప్రతి రోజూ ఉదయం బొప్పాయిని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో కొద్దిగా తీసుకున్నా చాలా మంచిది. దీని వల్ల మీ ఆరోగ్యంతో పాటు చర్మ అందం కూడా పెరుగుతుంది. జీర్ణ సమస్యలు, మలబద్ధకం సమస్యలతో బాధ పడేవారు ఖచ్చితంగా బొప్పాయిని తీసుకోవచ్చు.

బొప్పాయి గట్ ఆరోగ్యానికి చాలా మంచిది. మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తరిమికొడుతుంది. బొప్పాయి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బొప్పాయిలో ఉండే అన్ని మూలకాలు గుండె ఆరోగ్యాన్ని చాలా వరకు బలోపేతం చేస్తాయి.

షుగర్ ఉన్నవారు బొప్పాయిని ఉదయం తినకపోవడం మంచిది. బొప్పాయిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు, చెడు పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.

బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ప్రొటీన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు పద్ద మొత్తంలో ఉన్నాయి. బొప్పాయి ఆరోగ్యానికి అలాగే చర్మానికి మేలు చేస్తుంది. అందుకే చలికాలంలో ఈ పండును తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చు.




