AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Diet: మీరు వెయిట్‌ లాస్‌ అవ్వాలనుకుంటున్నారా?.. ఈ ఫుడ్స్‌ జోలికి అస్సలు వెళ్లకండి!

ఈ మధ్య వెయిట్‌ లాస్‌ అవ్వాలి, స్లిమ్‌గా, ఫిట్‌గా కనిపించాలని చాలా మంది అనుకుంటున్నారు. అందుకోసం జిమ్‌లకు వెళ్తూ వర్కౌట్స్‌ చేస్తున్నారు. అయితే వెయిట్‌ లాస్‌ అయ్యేందుకు వ్యాయామం ఎంత ముఖ్యమో, సరైన ఆహారం తీసుకోవడం, అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. కానీ కొందరూ ఇవేవి పాటించకుండా ఏది పడితే అది తింటూరు. దీని వల్ల వారు త్వరగా బరువు తగ్గలేరు. కాబట్టి మనం బరువు తగ్గాలనుకున్నప్పుడూ ఎలాంటి ఫుడ్స్‌ను తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Sep 11, 2025 | 3:59 PM

Share
మీరు బరువు తగ్గాలనుకున్నప్పుడు సోడా, ప్యాక్ చేసిన జ్యూస్, ఎనర్జీ డ్రింక్స్ వంటి హై షుగర్‌ జ్యూసెస్‌ను అస్సలూ తీసుకోకండి. వాటికి బదులుగా సాధారణ నీరు, నిమ్మరసం, చియా విత్తనాలతో గోరువెచ్చని నీరు, ఆపిల్ సైడర్ వెనిగర్ నీరు, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ లేదా తక్కువ కేలరీలు కలిగిన సాఫ్ట్‌ డ్రింక్స్‌ను తీసుకోవచ్చు.

1 / 6
మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్, డోనట్స్ వంటి వేయించిన ఆహారాలకు కూడా దూరంగా ఉండండి. బదులుగా, గ్రిల్డ్, ఎయిర్-ఫ్రైడ్, ఉడికించిన లేదా బేక్ చేసిన ఆహారాన్ని తినండి. దీనివల్ల మీరు తక్కువ కేలరీలు తీసుకుంటారు.

2 / 6
మీరు బరువు తగ్గాలనుకున్నప్పుడు వైట్ బ్రెడ్, వైట్ రైస్, పాస్తా, పేస్ట్రీలు వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తినకండి. వాటికి బదులుగా మీరు హోల్ గ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ రైస్, బాస్మతి రైస్, ఓట్స్, చిలగడదుంపలు వంటివి తినడం అలవాటు చేసుకోండి.

3 / 6
డైట్‌లో ఉండి కూడా చాలా మంది అల్పాహారంలో చిప్స్, కుకీలు, క్రాకర్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలను తినడానికి ఇష్టపడతారు. కానీ బరువు తగ్గేటప్పుడు వీటిని తినడం అనేది సరికాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బదులుగా మీరు సలాడ్, డ్రై ఫ్రూట్స్, సీడ్స్ లేదా గ్రీక్ పెరుగుతో మీ బ్రేక్‌ఫాస్ట్‌ లేదా ఈవినింగ్‌ స్కాక్స్‌ను ఫుల్‌ఫిల్ చేయవచ్చు

4 / 6
బరువు తగ్గాలనుకునే వారు ముఖ్యంగా ఐస్ క్రీం, స్వీట్‌ డెజర్ట్‌లకు దూరంగా ఉండండి. వాటి స్థానంలో బెర్రీలు, అరటిపండుతో గ్రీకు పెరుగును తినండి. కావాలంటే మీరు లైట్‌గా డార్క్ చాక్లెట్ కూడా తినవచ్చు.

5 / 6
మీరు బరువు తగ్గడానికి కష్టపడి పనిచేస్తుంటే, ఈ సమయంలో మద్యం సేవించడం మానుకోండి. బదులుగా, మీరు చాలా తక్కువ పరిమాణంలో రెడ్ వైన్, నిమ్మకాయ-పుదీనా నీరు, సోడా నీరు లేదా తాజా రసాలను తీసుకోండి. (NOTE: పైన పేర్కొన్న అంశాలు నివేదికలు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఇవ్వబడినవి. కాబట్టి వీటిలో మీకు ఏవైనా సందేహాలు ఉంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించండి)

6 / 6