- Telugu News Photo Gallery Watermelon rind benefits: Do not discard white layer of watermelon, it can offer these surprising benefits
Watermelon: పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా? ఇది పొట్టలోకి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా..
చాలా మందికి పుచ్చకాయలోని ఎర్రటి భాగాన్ని తినడం అలవాటు. మిగిలిన ఆకుపచ్చ తొక్కను, దానికి అంటుకున్న తెల్లటి భాగాన్ని పారేస్తుంటాం. అయితే వైద్యులు పూర్తిగా భిన్నమైన విషయం ఒకటి చెబుతున్నారు. అందేంటంటే.. పుచ్చకాయలోని తెల్లని భాగాన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటంటే..
Updated on: Apr 04, 2025 | 2:37 PM

వేసవిలో ప్రకృతి ప్రసాధించిన అద్భుత వరం పుచ్చకాయ. పండ్ల రారాజు మామిడి, లిచీ, పుచ్చకాయ వంటి అన్ని రకాల పండ్లు ఈ కాలంలో అధికంగా వస్తాయి. ముఖ్యంగా వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగించడంలో పుచ్చకాయకు మించిన ప్రత్యామ్నయం మరొకటి లేదు.

అయితే మనలో చాలా మందికి పుచ్చకాయలోని ఎర్రటి భాగాన్ని తినడం అలవాటు. మిగిలిన ఆకుపచ్చ తొక్కను, దానికి అంటుకున్న తెల్లటి భాగాన్ని పారేస్తుంటాం. అయితే వైద్యులు పూర్తిగా భిన్నమైన విషయం ఒకటి చెబుతున్నారు. అందేంటంటే.. పుచ్చకాయలోని తెల్లని భాగాన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటంటే..

ఇందులో సిట్రుల్లైన్ అనే ఒక రకమైన అనావశ్యక అమైనో ఆమ్లం ఉంటుంది. పుచ్చకాయలోని తెల్లని భాగం తినడం వల్ల శరీరంలో దీని స్థాయి పెరుగుతుంది. సిట్రులిన్ మన రక్త నాళాలను విస్తరిస్తుంది. యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ప్రకారం సిట్రుల్లైన్ కండరాలకు ఆక్సిజన్ అందిస్తుంది. ఫలితంగా పనితీరు పెరుగుతుంది.

అమెరికన్ జర్నల్ ఆఫ్ హైపర్‌టెన్షన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. పుచ్చకాయలోని తెలుపు, ఇతర భాగాలు పెద్దలలో అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. పుచ్చకాయ తొక్కలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయనే సంగతి తెలిసిన విషయమే.

ఫైబర్ ప్రేగు కదలికలకు సహాయపడుతుంది. పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు త్వరగా కడుపు నింపుతాయి. ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తాయి. బరువును నియంత్రించడంలో సహాయపడతాయి.





























