AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain Health Tips: మెదడుకు పదునుపెట్టే వాల్‌నట్స్, బాదం.. వీటిల్లో ఏది ఎక్కువ మేలు చేస్తుందో తెలుసా?

ప్రస్తుతం పరీక్షల సమయం.. విద్యార్ధులంతా పుస్తకాలతో కుస్తీలుపడుతుంటారు. అయితే చదివినవి గుర్తు పెట్టుకోవాలంటే పోషకాహారం కూడా తీసుకోవాలి. మెదడుకు మేలు చేసే ఆహారాల్లో బాదం, వాల్‌నట్స్ ముందు వరుసలో ఉంటాయి. నిజానికి.. వాల్‌నట్స్, బాదం రెండూ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా..

Srilakshmi C
|

Updated on: Feb 12, 2025 | 8:43 PM

Share
వాల్‌నట్స్, బాదం రెండూ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పోషక సాంద్రతలో రెండూ ఒకేలా ఉన్నప్పటికీ, వాటి నిర్మాణంలో తేడాలు ఉన్నాయి. వాల్‌నట్స్‌లో ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడుకు చాలా మంచివి. వాల్‌నట్స్‌లో విటమిన్ ఇ తక్కువగా ఉంటుంది. బాదంపప్పులో ప్రోటీన్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను రక్షిస్తాయి.మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీటిల్లో ఏది తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
వాల్‌నట్స్‌లో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి పేగులోని బ్యాక్టీరియాను మార్చి వాపును తగ్గిస్తాయి. వాల్‌నట్స్ మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వాల్‌నట్స్ ఆకలిని నియంత్రిస్తాయి. దీనివల్ల అనారోగ్యకరమైన ఆహారం తినాలనే కోరిక తగ్గుతుంది.

2 / 5
ఇందులో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.ఇది మొక్కల ఆధారిత ఒమేగా-3 కొవ్వు ఆమ్లం. ఇది మెదడు పనితీరుకు సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి కోల్పోవడం సాధారణంగా వయస్సుతో సంభవిస్తుంది. కానీ వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల దానిని నివారించవచ్చు. కొన్ని అధ్యయనాలు ఒమేగా-3లు జ్ఞాపకశక్తి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయని నిరూపించాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. వాల్‌నట్స్ గుండె ఆరోగ్యాన్ని బలపరుస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. వాల్‌నట్స్‌లోని పాలీఫెనాల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు న్యూరాన్‌ల పనితీరు, సమాచార మార్పిడికి తోడ్పడతాయి. అందువల్ల జ్ఞాపకశక్తి, మెదడు పనితీరును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

3 / 5
వాల్ నట్స్ ను ఎక్కువగా తింటే కొంతమందికి కాళ్ల వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. వాల్‌నట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. కానీ అతిగా తినడం వల్ల మలబద్ధకం పెరిగే అవకాశం కూడా ఉంది.

4 / 5
వాల్‌నట్స్‌ అతిగా తినడం వల్ల ఛాతిలో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. తొందరగా జీర్ణం కాకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. పోషకాల కోసం వాల్‌నట్స్‌ మీద అతిగా ఆధారపడటం మంచిది కాదు. దీనివల్ల మిగతా పోషకాల లోపం ఏర్పడుతుంది. వీటిని మితంగా తీసుకుంటూ మిగతా పోషకాహారం తీసుకోవాలి.

5 / 5