AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజంతా నిద్రమత్తుగా, ఏ పని చేయలేకపోతున్నారా..? అయితే ఈ కారణాలు ఉండొచ్చు..

ఆరోగ్యంగా ఉండటానికి శరీరంలో అవసరమైన అన్ని విటమిన్లు సరైన పరిమాణంలో ఉండటం చాలా ముఖ్యం. ఈ విటమిన్ల లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. విటమిన్లు లేకపోవడం వల్ల కలిగే సమస్యల్లో ఒకటి నిద్ర సమస్య కూడా. రోజంతా నిద్రమత్తుగా ఉండటం కూడా విటమిన్‌ లోపమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే, ఇందుకు కారణమైన విటమిన్‌ ఏంటి..? దాని గురించిన పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Jan 30, 2025 | 9:33 PM

Share
మీరు రోజంతా హెల్దీగా ఉండాలంటే, అన్ని రకాల విటమిన్లతో పాటుగా మీ శరీరంలో విటమిన్ బి12 కూడా సరైన మోతాదులో ఉండాలి. బీ12 అనేది అతి ముఖ్యమైన సూక్ష్మ పోషకం. శరీరంలోని వివిధ అవయవాల పనితీరుపై ఇది ప్రభావం చూపిస్తుంది.

1 / 5
ముఖ్యంగా శరీరంలో బీ 12 విటమిన్ లోపం ఉంటే మీకు రోజంతా నిద్రమత్తుగా ఉంటుంది. మీరు ఎక్కువ గంటలు నిద్రపోయిన తర్వాత కూడా ఇంకా మబ్బుగా, అలసటగా అనిపించటం, ఏ పనిచేయాలన్నా బలం కూడగట్టుకోలేకపోతే దీనికి కారణం శరీరంలో విటమిన్ బి12 లోపంగానే గుర్తించాలంటున్నారు నిపుణులు.

2 / 5
అంతేకాదు..  విటమిన్ బీ12 లోపం వల్ల మూడ్ స్వీగ్స్ ఎదుర్కొంటారు. దాంతో పాటుగా జ్ఞాపకశక్తి సమస్యలు కూడా వేధిస్తాయి. ఏ వస్తువు ఎక్కడ పెట్టారో పదే పదే వెతుక్కోవాల్సి వస్తుంది.
అలాగే, ఎప్పుడూ తూలి పడిపోతున్నట్టుగా ఉంటుంది. ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోవటం కూడా అది విటమిన్ బీ12 లోపంగా గమనించాలి.

అంతేకాదు.. విటమిన్ బీ12 లోపం వల్ల మూడ్ స్వీగ్స్ ఎదుర్కొంటారు. దాంతో పాటుగా జ్ఞాపకశక్తి సమస్యలు కూడా వేధిస్తాయి. ఏ వస్తువు ఎక్కడ పెట్టారో పదే పదే వెతుక్కోవాల్సి వస్తుంది. అలాగే, ఎప్పుడూ తూలి పడిపోతున్నట్టుగా ఉంటుంది. ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోవటం కూడా అది విటమిన్ బీ12 లోపంగా గమనించాలి.

3 / 5
అలసట, రాత్రుళ్లు అధిక చెమట కూడా విటమిన్ బీ 12 లోపం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.  విటమిన్ బీ12 లోపం ఉంటే మీ కండరాలు బలహీనంగా మారుతాయి. అలాగే, మీరు గతంలో ఉన్నంత హుషారుగా లేకపోతే, మీకు ఆత్మ విశ్వాసం తగ్గినట్టు అనిపిస్తే, నిరాశ, నిస్సహాయత అనిపిస్తే విటమిన్ బీ12 లోపం ఉన్నట్టుగా గమనించాలి.

4 / 5
అయితే, శరీరం తనంతట తాను బీ12 ఉత్పత్తి చేయలేదు. అందువల్ల ఆహారం ద్వారానే మనం బీ12 విటమిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా జంతు ఉత్పత్తుల్లోనే లభిస్తుంది. పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లలో విటమిన్ బీ 12 లభిస్తుంది. వెజిటేరియన్లు, వేగన్స్ అయితే సప్లిమెంట్ల ద్వారా గానీ, విటమిన్ బీ 12 కలిపిన బలవర్థక ఆహారం ద్వారా ఇది లభిస్తుంది. ఈ బీ 12 విటమిన్ కాలేయంలో ఐదేళ్లపాటు నిల్వ ఉంటుంది. ఈ నిల్వ తగ్గినప్పుడు విటమిన్ లోపం ఏర్పడుతుంది.

5 / 5
Follow Us
మహానటి సావిత్రి ఆ తెలుగు స్టార్ హీరోను బావ అని పిలిచేది తెలుసా?

ఈ పుట్టిన తేదీల వారికి బంగారం వేసుకుంటే అదృష్టం వెంటపడుతుంది!

మస్కిటో కాయిల్ అంటుకొని చనిపోయాడా..? అర్థరాత్రి ఇంకేమైనా జరిగిందా

చెరకు రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..?

టాస్ గెలిచిన ముంబై.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే

యూట్యూబ్ సంపాదన చెప్పిన జబర్దస్త్ మహిధర్..

అందమైన పూలు..కానీ,అడవులకు శాపం! భారతదేశాన్ని వణికిస్తున్న ఈ మొక్క

జీవితంలో మళ్లీ అతడితో అస్సలు పని చేయొద్దు అనుకున్నా..

టీవీలో బాలయ్య 'అఖండ 2 తాండవం'.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

భారత్‌లో భానుడి విశ్వరూపం.. రాబోయే ఐదు రోజుల్లో మాడు పగిలే ఎండలు