కాకులలో ఎన్ని రకాలున్నాయో తెలుసా.. లోకంలో ఎంత అందమైన కాకులున్నాయంటే.. ఫోటోస్ వైరల్..

కాకులు.... మన చెవులు చిల్లులు పడేలా అరుస్తుంటాయి. కానీ మనం ఎప్పుడూ చూసిన నల్ల కాకులు మాత్రమే దర్శనమిస్తుంటాయి. కానీ కాకుల్లో కూడా అందమైనవి ఉన్నాయండి. లోకంలో రకారకాల రంగుల్లో అందమైన కాకులున్నాయి. ఇవన్ని కార్విడె కుటుంబానికి చెందినవి. వీటిని హౌస్ క్రోలని, రావెన్స్, జాక్ డా, మాగ్ పీ అని పిలుస్తుంటారు. మరీ అవేంటో తెలుసుకుందామా..

  • Rajitha Chanti
  • Publish Date - 9:01 pm, Fri, 16 April 21
1/11
Rupose Trip
రుఫోస్ ట్రీపీ.. ఈ కాకి గోధుమ రంగులో ఉంటుంది. సాధారణ వర్షపాతం ఉండే ప్రాంతాలు, అడవులు, పట్టణాల్లోని ఉద్యానవనాల్లో ఇది కనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోతుంది. పళ్లు, గింజలు, కీటకాలు, చిన్న చిన్న జీవులు దీని ప్రధాన ఆహారం.
2/11
Wight Belly Tree Py
వైట్ బెల్లీడ్ ట్రీ పీ.. దీని తోక పొడుగ్గా ఉంటుంది. పశ్చిమ కనుమలలో ఉంటుంది. రూఫోస్‌ ట్రీపీతో స్నేహం చేస్తుంది. జనావాసాలు అంటే దీనికి పడదు. గింజలు, కీటకాలు, సరీసృపాలు, ఎలుకలు దీని ఆహారం.
3/11
Common Maag Py
కామన్ గ్రీన్ మాగ్ పీ.. ఇది పక్షి జాతుల్లోనే అందమైనది. పచ్చని పరిమాణంలో పరిమాణంలోని చిన్నగా ఉంటుంది. ఇది ఎక్కువగా హిమాలయాల్లో, ఈశాన్య భారతంలో కనిపిస్తుంది.
4/11
Indian Jungle Crow
ఇండియన్‌ జంగిల్‌ క్రో.. ఇది పూర్తి నల్లగా, కొంచెం పెద్దగా ఉంటుంది. జంగిల్‌ క్రో అయినా జనావాసాలకు దగ్గరలోనే నివసిస్తుంది.
5/11
Lord Billed Crow
లార్జ్ బిల్లెడ్ క్రో.. ఇది అడవ కాకిలాగే పెద్దగా ఉంటుంది. కానీ సైజులో తేడా కనిపిస్తుంది. భారత్, ఆగ్నేయ ఆసియా దేశాల్లోని కాకుల్లో ఇది స్పష్టంగా తెలుస్తుంది. పరిస్థితులకు అనుకూలంగా మారుతుంది.
6/11
Yellow Billed Blue Maag Py
యెల్లో బిల్లెడ్‌ బ్లూ మాగ్‌పీ.. వైట్‌ బెల్లీడ్‌ ట్రీ పీలాగే దీనికి కూడా పొడవైన తోక ఉంటుంది. కామన్‌ గ్రీన్‌ మాగ్‌పీలా అందంగా ఉంటుంది. భారత ఉపఖండంలోని ఉత్తర ప్రాంతాల్లో ఇది నివసిస్తుంది. నేలపై ఉండే ఆహారాన్ని సేకరించి కడుపునింపుకుంటుంది.
7/11
Black Headed Je
బ్లాక్‌ హెడెడ్‌ జే.. హిమాలయాల్లో ఉంటుంది. నేపాల్, భూటాన్‌ వ్యవసాయ భూముల్లో కూడా అప్పుడప్పుడూ కనిపిస్తుంది. దీని తలపైన నల్లగా ఉంటుంది. యూరేసియన్‌ జేకి ఇది దగ్గరి చుట్టం. అదే పరిమాణంలో కూడా ఉంటుంది.
8/11
House Crow
హౌస్‌ క్రో.. ఇది మనుషులకు దగ్గరగా ఉంటాయి. కాకి జాతుల్లో కర్ణకఠోరంగా కావ్‌ కావ్‌ మంటూ కూసే కాకి ఇదే. నల్లగా ఉన్నా.. కొంత భాగం బూడిద రంగులో మెరుస్తూ ఉంటుంది.
9/11
Common Raven
కామన్‌ రావెన్‌.. కాకుల్లోనే పెద్దది. అలాగే ఇది తెలివైనది. అంతేగాక అవకాశవాది అనే పేరున్నది. వాయవ్య భారతంలో మాత్రమే కనిపిస్తుంది. రాజస్థాన్, పంజాబ్‌తో పాటు సమీపంలోని ఎడారుల్లో జీవిస్తుంది.
10/11
Westren Jack Da
వెస్ట్రన్‌ జాక్‌డా.. కాకుల్లోనే చిన్నది. ఉత్తర భారతంలోని కశ్మీర్లో కనిపిస్తుంది. తిండి విషయంలో అవకాశవాది. మొక్కలు, క్రిములు చివరకు వాన పాములు లాంటి వాటికి కూడా గుటుక్కుమనిపిస్తుంది.
11/11
Crows In India
Crows In India