- Telugu News Photo Gallery Viral photos A secret Cold War cash bunker in Germany Photos Viral On Social Media
Viral: లక్షల కోట్ల డబ్బు.. చివరికి కాల్చి బూడిద చేశారు.. అసలు సంగతి తెలిస్తే ఫ్యూజులు ఔట్.!
కొన్ని లక్షల కోట్ల డబ్బును 25 ఏళ్లుగా కాపాడుకుంటూ వచ్చారు... చివరికి కాల్చి బూడిద చేశారు. ఏంటి చదవగానే షాక్ అయ్యారా.? అయితే అసలు స్టోరీ ఏంటో తెలుసుకుంటే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి.!
Updated on: Mar 15, 2022 | 4:43 PM

కొన్ని లక్షల కోట్ల డబ్బును 25 ఏళ్లుగా కాపాడుకుంటూ వచ్చారు... చివరికి కాల్చి బూడిద చేశారు. ఏంటి చదవగానే షాక్ అయ్యారా.? అయితే అసలు స్టోరీ ఏంటో తెలుసుకుంటే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి.! ఈ ఘటన జర్మనీలో జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

చరిత్ర.. ఎన్నో ఆశ్చర్యాలు, అరుదైన విషయాలకు సాక్ష్యంగా నిలుస్తుంది. అటువంటి వాటిల్లో జర్మనీలోని కోచెమ్ పట్టణంలో ఉన్న బంకర్ కూడా ఒకటి. అమెరికా-సోవియట్ యూనియన్ మధ్య ‘కోల్డ్ వార్’ నడిచిన సమయంలో జర్మనీ ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున ధనాన్ని బంకర్‌లో దాచి పెట్టిందట. ఈ విషయం అక్కడి ప్రజలకుగానీ, మరెవరికీ తెలియకుండా చాలా గోప్యత పాటించారు.

15 బిలియన్లు అంటే ప్రస్తుత కరెన్సీ ప్రకారం సుమారు 1.25 లక్షల కోట్లు బంకర్‌లో దాచిపెట్టారు. అంతేకాదు మరో 11 బిలియన్ల మేర ఆల్టర్నేటివ్ కరెన్సీని కూడా ఆ బంకర్‌లో జర్మనీ సెంట్రల్ బ్యాంకు దాచిపెట్టిందట. కాగా డబ్బులు దాచి పెట్టిన బంకర్‌కు బీబీకే-2 అని కోడ్ కూడా ఇచ్చారట.

కోల్డ్ వార్ సమయంలో జర్మనీ మానిటరీ వ్యవస్థపై దాడి జరుగుతుందనే అనుమానంతో ముందు జాగ్రత్తగా ఈ బంకర్‌ను ఏర్పాటు చేసి.. పెద్ద ఎత్తున ధనాన్ని నిల్వ చేశారట. 1964 నుంచి పదేళ్ల పాటు వందలాది ట్రక్కుల్లో కరెన్సీ కట్టలను ఈ బంకర్‌లోకి చేర్చారట.

ఎవరూ అనుమానించలేని విధంగా నాడు ఈ రహస్య ఆపరేషన్ నిర్వహించారట. 18,300 బాక్సుల్లో బ్యాంకు నోట్లను ఉంచి భద్రపరిచారట. ఇందుకోసం భూగర్భంలో 1,500 చదరపు మీటర్లు విస్తీర్ణంతో ఈ బంకర్ ఏర్పాటు చేశారట.

1989లో కోల్డ్ వార్ ముగింపునకు రావడంతో బంకర్‌లోని నోట్లను బయటకు తీసి తగలబెట్టారట. అనంతరం ఈ బంకర్ ఒక కోపరేటివ్ బ్యాంకు చేతికి వెళ్లగా.. 2016లో పెట్రా రాయిటర్, మన్ ఫ్రెడ్ దంపతుల చేతికి వెళ్లి అది మ్యూజియంగా రూపుదాల్చిందట. ప్రస్తుతం ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతుండటంతో ఈ బంకర్ల అంశం హాట్ టాపిక్‌గా మారింది.




