- Telugu News Photo Gallery Use camphor like these to get glowing skin, check here is details in Telugu
Camphor for Skin: కర్పూరంతో కేవలం పది నిమిషాల్లోనే మీ ముఖాన్ని మెరిపించండిలా!
కర్పూరం అనగానే దేవుని పూజకు ఉపయోగించే వస్తువు అని వెంటనే గుర్తుకు వస్తుంది. కానీ కర్పూరంతో అనేక ప్రాబ్లమ్స్‌కి చెక్ పెట్టొచ్చు. అయితే ఈ కర్పూరంలో అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కర్పూరంలో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఈ కర్పూరంతో ముఖాన్ని కూడా మెరిపించుకోవచ్చు. ఒక గిన్నెలో కొద్దిగా బాదం నూనె, చిటికెడు కర్పూరం పొడిని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ముఖానికి బాగా అప్లై..
Updated on: Feb 02, 2024 | 6:23 PM

కర్పూరం అనగానే దేవుని పూజకు ఉపయోగించే వస్తువు అని వెంటనే గుర్తుకు వస్తుంది. కానీ కర్పూరంతో అనేక ప్రాబ్లమ్స్‌కి చెక్ పెట్టొచ్చు. అయితే ఈ కర్పూరంలో అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కర్పూరంలో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఈ కర్పూరంతో ముఖాన్ని కూడా మెరిపించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దం.

ఒక గిన్నెలో కొద్దిగా బాదం నూనె, చిటికెడు కర్పూరం పొడిని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ముఖానికి బాగా అప్లై చేసుకోవాలి. ఓ పది నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని కడగాలి. మీ ముఖంపై ఉండే జిడ్డు తొలగి.. ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

అదే విధంగా కొద్దిగా కర్పూరంతో చనగ పిండి, కొద్దిగా రోజ్ వాటర్ వేసి పేస్ట్‌లా సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి బాగా పట్టించండి. ఓ 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే.. ముఖం చంద్రబింబంలా మెరుస్తుంది. తేడా మీకు కనిపిస్తుంది.

ముల్తానీ మట్టి, చిటికెడు కర్పూరం, రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖాని అప్లై చేసి, ఓ పది నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖంలో గ్లో వస్తుంది.

అదే విధంగా కొబ్బరి నూనెలో కూడా చిటికెడు కర్పూరం కలిపి ముఖానికి రాసుకోండి. సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఇలా ఓ 15 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ ముఖానికి తేమ బాగా అంది ముఖం అందంగా కనిపిస్తుంది.




