- Telugu News Photo Gallery Two decades ago featherless chicken was created but why they are not in Market
Featherless chicken: 20 ఏళ్ల క్రితమే వేడిని తట్టుకునేలా సృష్టించిన ఈకలు లేని కోళ్లు..
సాధారణంగా వేసవి కాలంలో కోళ్లు ఉష్ణోగ్రతలు తట్టుకోలేక మరణిస్తుంటాయి. అయితే ఇలాంటి సమస్యను పరిష్కరించేందుకు ఇజ్రాయెల్‌కు చెందిన ఓ శాస్త్రవేత్త ఈకలు లేని కోళ్లను సృష్టించాడు. వాస్తవానికి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బాయిలర్ కోళ్లు జన్యుపరంగా మార్పు చేసినవి. మరో విషయం ఏంటంటే అవి దాణా ఎక్కవగా తింటాయి.
Updated on: Jul 10, 2023 | 7:53 PM

సాధారణంగా వేసవి కాలంలో కోళ్లు ఉష్ణోగ్రతలు తట్టుకోలేక మరణిస్తుంటాయి. అయితే ఇలాంటి సమస్యను పరిష్కరించేందుకు ఇజ్రాయెల్‌కు చెందిన ఓ శాస్త్రవేత్త ఈకలు లేని కోళ్లను సృష్టించాడు. వాస్తవానికి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బాయిలర్ కోళ్లు జన్యుపరంగా మార్పు చేసినవి. మరో విషయం ఏంటంటే అవి దాణా ఎక్కవగా తింటాయి.

అవి దాణా ఎక్కువగా తినడం వల్ల జీవప్రక్రియ వేగంగా జరగడంతో వాటి శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఇవి వేగంగా పెరగడంతోనే వ్యాపారులు డిమాండ్‌కు తగ్గట్లు మాంసాన్ని సరఫరా చేయలేకపోతున్నారు. ఇలాంటి కోళ్లు పెంచేందుకు కూలర్లు వాడాల్సిన పరిస్థితి వస్తోంది. ఒకవేల ఇవి వాడకపోతే కోళ్లు చనిపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకే ఈకలు లేని కోడి ఆలోచన పుట్టింది.

ఇజ్రాయెల్‌కు చెందిన జన్యుశాస్త్రవేత్త అవిగ్డోర్ మొదటిసారిగా 2002లో ఈకలు లేని కోళ్ల జాతిని అభివృద్ధి చేశారు. అయితే కొత్త రకం చికెన్‌ను అభివృద్ధి చేయడానికి ఆయన పలు అసహజ, అనైతిక జన్యుమార్పులు చేశారని విమర్శలు కూడా వచ్చాయి. కానీ అవిగ్డోర్ మాత్రం ఈకల లేని కోళ్లను, బాయిలర్ కోళ్లను మాత్రమే తీసుకొని ప్రయోగాలు చేశానని స్పష్టం చేశారు. తాను అభివృద్ధి చేసిన కోళ్లు జన్యుపరంగా మార్పు చేసింది కాదని తెలిపారు.

ఈ రకం కోళ్లల్లో 50 ఏళ్ల నాటి లక్షణాలు ఉన్నాయని తెలిపారు. అలాగే వాటి రూపం అసాధారణంగా ఉండటం వల్ల ప్రపంచం దృష్టిని అవి ఆకర్షిస్తాయని పేర్కొన్నారు. తక్కువగా ఆహారం తీసుకోవడం, తొందరగా పెరగడం, కూలర్లు లాంటివి అవసరం లేకుండానే వేడిని తట్టుకనే లక్షణాలు ఆ జాతి కోళ్లలో ఉన్నట్లు పేర్కొన్నారు. వడదెబ్బ, అధిక ఉష్ణోగ్రతలు, చర్మవ్యాధులు, దోమకాట్లను ఈ కోళ్లు తట్టుకుంటాయని తెలిపారు.

అయితే ఈ ఈకలు లేని కోడిని సృష్టించి 20 ఏళ్లు దాటినప్పటికీ అవి మార్కెట్లోకి ఎక్కవగా రాకపోవడానికి ముఖ్య కారణం వాటి అసహజ రూపం. అలాగే మగ కోళ్లు కూడా వాటితో సంభోగం చేసేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవి. మరో విషయం ఏంటంటే నాన్ వెజ్ ప్రియులు కూడా వీటిని అసహ్యించుకున్నారు. ఇవి అనారోగ్యం అని మరికొందరు ఈ కోళ్లను వ్యతిరేకించారు.
