- Telugu News Photo Gallery Relationship Tips: convince your angry partner like this increase love in relationship
Relationship Tips: ఇలా చేస్తే మీ భాగస్వామి దిల్ ఖుష్ అవ్వాల్సిందే.. ఆ సమయంలో సర్‌ప్రైజ్ చేసే చిట్కాలివే..
How To Make Partner Happy: రిలేషన్ షిప్‌లో దంపతుల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం. అయితే కొన్ని సార్లు గొడవలు హద్దుదాటుతాయి.. మనస్పర్థలు పెరిగి భార్యాభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు కోపం తెచ్చుకునే స్థాయికి వెళతారు.
Updated on: Jul 10, 2023 | 10:25 PM

How To Make Partner Happy: రిలేషన్ షిప్‌లో దంపతుల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం. అయితే కొన్ని సార్లు గొడవలు హద్దుదాటుతాయి.. మనస్పర్థలు పెరిగి భార్యాభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు కోపం తెచ్చుకునే స్థాయికి వెళతారు. అయితే, ఈ అసంతృప్తికి చాలా కారణాలు ఉండవచ్చు. చాలా మంది భాగస్వాములు సరైన సమయంలో ఎదుటి వ్యక్తి అసంతృప్తిని తొలగించలేరు. దాని కారణంగా ఇద్దరి మధ్యనున్న విషయం మరింత దిగజారేలా మారుతుంది.

భార్యాభర్తలైనా, ప్రేమికులైనా.. మనస్పర్థలు ఎక్కువ కాలం కొనసాగితే ఆ బంధం చెడిపోతుంది. అటువంటి పరిస్థితిలో మీ కోపంగా ఉన్న భాగస్వామిని ఒప్పించేందుకు మీరు ఈ చిట్కాలను అనుసరిస్తే.. కోపం చల్లారి ప్రేమ పెరుగుతుంది. అంతేకాకుండా దంపతులిద్దరూ మానసికంగా, శారీరకంగా ఎంజాయ్ చేయవచ్చు.

భాగస్వామికి సమయం ఇవ్వండిః ఈరోజుల్లో ప్రతి ఒక్కరి జీవితం చాలా బిజీగా మారిపోయింది. అటువంటి పరిస్థితిలో, చాలామంది తమ భాగస్వామికి సమయం ఇవ్వడానికి అవకాశం ఉండదు.. దీంతో వారి మధ్య దూరం పెరగడం మొదలవుతుంది. అందుకే మీరు మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపాలి. ఎప్పుడు వీలైతే అప్పుడు.. బయటకు వెళ్లండి.. డిన్నర్ చేయండి.

ఆశ్చర్య పర్చండిః మీ భాగస్వామి మీపై కోపంగా ఉంటే, మీ భాగస్వామిని ఒప్పించేందుకు మీరు మీ ప్రేమను తెలియజేయడానికి ప్రయత్నించండి.. అలాగే, మీరు వారికి మంచిగా సర్ప్రైజ్ ఇవ్వడానికి ప్రయత్నించండి. దీంతో నిమిషాల్లోనే వారి అసంతృప్తి మాయమైపోతుంది. అందుకే.. కోపంగా ఉన్నప్పుడు తమ భాగస్వామిని ఆశ్చర్యపర్చడానికి కొందరు ఇలాంటి చిట్కాలనే అనుసరిస్తారు.

ప్రత్యేక అనుభూతిని కలిగించండిః మీ సంబంధంలో ప్రేమ, ఆప్యాయత ఎల్లప్పుడూ ఉండాలని మీరు కోరుకుంటే, మీరు ఎదుటి వ్యక్తిని ప్రత్యేకంగా భావించేలా చేయాలి. వారు మీకు ఎంత ముఖ్యమో వారికి తెలియజేయండి. ఈ చిన్న విషయాలు వారిలోని ఆగ్రహాన్ని దూరం చేసి ప్రేమను పెంచుతాయి. ఇది రిలేషన్‌షిప్‌లో తాజాదనాన్ని, ఉత్సాహాన్ని కూడా కొనసాగిస్తుంది.





























