AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హనుమంతుడు ఎప్పటికీ మరణించడని ఎందుకు నమ్ముతారు..? హనుమాన్ ఇప్పటికీ జీవించి ఉన్నారని నమ్మే ప్రదేశాలు మీకు తెలుసా..?

మనలో చాలా మంది ఇప్పటికీ హనుమంతుడు దేవుడిగా మన మధ్యనే ఉన్నారని.. ఆయన ఎప్పటికీ మరణించని వ్యక్తి అని నమ్ముతారు. ఎవరైనా కష్టాల్లో ఉండి హనుమాన్‌ ను పిలిస్తే ఆయన తప్పకుండా సహాయం చేస్తారని భక్తులు విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం.. హనుమంతుడు ఇప్పటికీ ఉన్న కొన్ని ప్రదేశాలు, కొండలు, గుహల గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ హనుమంతుడు ఉండి భక్తుల కోరికలు వింటారని ప్రజలు నమ్ముతారు. ఆ ప్రదేశాల కథలు, భక్తుల అనుభవాలు ఈ నమ్మకాన్ని ఇంకా పెంచుతున్నాయి.

Prashanthi V
|

Updated on: Aug 21, 2025 | 8:03 PM

Share
గంధమాదన పర్వతం.. హిమాలయాల్లోని బద్రీనాథ్, మానససరోవర్ మధ్య ఈ పర్వతం ఉందని చెబుతారు. తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ఈ పర్వతం నుంచే హనుమంతుడు లంకకు వెళ్లడానికి సముద్రం దాటారని నమ్ముతారు. ఇక్కడ ఒక రాయిపై హనుమంతుడి పాద ముద్రలు కూడా కనిపిస్తాయి. ఈ పర్వతంపై ఆయన ఇప్పటికీ ధ్యానం చేస్తూ ఉంటారని.. అందుకే ఈ ప్రదేశం చాలా శక్తివంతమైనదని అంటారు.

1 / 7
హిమాలయాలు, గుహలు.. హిమాలయాలకు కూడా హనుమాన్‌ కు సంబంధం ఉందని చెబుతారు. హిమాచల్ ప్రదేశ్‌ లోని హనుమాన్ టిబ్బా, ఉత్తరాఖండ్‌లోని కొన్ని గుహల్లో ఆయన ధ్యానంలో ఉన్నారని చాలా మంది నమ్ముతారు.

2 / 7
మానససరోవర్ సరస్సు.. టిబెట్‌ లో ఉన్న మానససరోవర్ సరస్సు శివుడికి శక్తి కేంద్రమే కాకుండా.. హనుమాన్‌కు కూడా ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడకు వెళ్లిన భక్తులు, సాధువులు ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను, దైవశక్తిని అనుభూతి చెందుతారు.

3 / 7
చిత్రకూట్ హనుమాన్ ధార.. చిత్రకూట్‌లోని హనుమాన్ ధార దగ్గర కూడా భక్తులు హనుమాన్‌ శక్తిని అనుభవిస్తారు. సీతను వెతుకుతున్నప్పుడు ఆయన ఒంటిపై ఉన్న అగ్నిని ఇక్కడ చల్లార్చుకున్నారని పురాణాలు చెబుతున్నాయి.

4 / 7
పంచముఖి హనుమాన్ ఆలయం.. రామేశ్వరంలోని ఈ గుడిలో ఐదు ముఖాల హనుమంతుడిని పూజిస్తారు. మహిరావణుడిని చంపేటప్పుడు హనుమాన్ ఐదు ముఖాలు ధరించారని చెబుతారు. ఈ గుడి చెడు శక్తుల నుంచి రక్షిస్తుందని నమ్మకం.

5 / 7
హనుమాన్ గఢీ, అయోధ్య.. అయోధ్యలోని ఈ గుడి గురించి ఒక కథ ఉంది. రాముడి నగరాన్ని కాపాడడానికి హనుమాన్ ఇక్కడే ఉంటారని ప్రజలు నమ్ముతారు. భక్తులు చేసే ప్రార్థనలు, జైకారాల ప్రభావం ఇక్కడ ఎల్లప్పుడూ ఉంటుంది.

6 / 7
హనుమాన్ ఎందుకు చిరంజీవి..? పురాణం ప్రకారం.. సీత, రాముడు హనుమాన్‌కు చిరంజీ వి (ఎప్పటికీ బతికి ఉండే వరం) వరం ఇచ్చారు. కలియుగంలో మంచివాళ్లు కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేయడానికి హనుమాన్ వస్తారని రాముడు ఆజ్ఞాపించాడని చెబుతారు. అందుకే ఎక్కడ రాముడి పేరు చెబుతారో అక్కడ హనుమాన్ ఉంటారని నమ్ముతారు.

7 / 7
Follow Us
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..

కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!