ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. అందుకే ప్రతిరోజూ ఖర్జూరం తినాలని వైద్యులు సూచిస్తుంటారు.. ఖర్జూరాలు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.. ఖర్జూరంలో ఐరన్, మినరల్స్, కాల్షియం, అమినో యాసిడ్స్, ఫాస్పరస్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఖర్జూరం తినడం వల్ల శరీరానికి ఆరోగ్యకరమైన కేలరీలు అందుతాయి. వాస్తవానికి ఆరోగ్యకరమైన ఆహారంలో సాధారణంగా తీపి పదార్థాలు ఉండవు.. కానీ ఖర్జూరం సహజమైన చక్కెర మన ఆరోగ్యానికి మేలు చేసే పండు.. అంతేకాకుండా, శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. ఉదయాన్నే ఆహారంలో తినడం.. లేదా పాలలో ఖర్జూరాలను కలిపి తాగడం వల్ల శరీరానికి అందే పోషకాలు డబుల్ అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. డైలీ ఖర్జూరం ఎందుకు తినాలి..? తినడం వల్ల కలిగే ఐదు కీలక ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..