- Telugu News Photo Gallery If you are very tired, you will be energetic if you drink these, Check here is Details
Energetic Drinks: బాగా అలసిపోతున్నారా.. వీటిని తాగితే ఎనర్జిటిక్‌గా ఉంటారు..
శరీరం ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే అనేక పోషకాలు అవసరం. వీటిల్లో ఏది ఎక్కువైనా.. తక్కువైనా ఆ ఎఫెక్ట్ శరీరంపై పడుతుంది. శరీరంలో తగినంత ఎనర్జీ, స్టామినా లేకపోతే త్వరగా నీరసించి పోతారు. పని ఒత్తిడి ఎక్కువైనా, సరిగా నిద్ర లేకపోయినా, మానసిక కారణాల త్వరగా బలహీన పడుతూ ఉంటారు. ఇలాంటి వారు కొన్ని రకాల హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి. అలాగే ప్రతి రోజూ వ్యాయామాలు కూడా చేస్తూ ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సహంగా, ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు. మరి ఆ ఆహారాలు..
Updated on: Sep 08, 2024 | 4:56 PM

శరీరం ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే అనేక పోషకాలు అవసరం. వీటిల్లో ఏది ఎక్కువైనా.. తక్కువైనా ఆ ఎఫెక్ట్ శరీరంపై పడుతుంది. శరీరంలో తగినంత ఎనర్జీ, స్టామినా లేకపోతే త్వరగా నీరసించి పోతారు. పని ఒత్తిడి ఎక్కువైనా, సరిగా నిద్ర లేకపోయినా, మానసిక కారణాల త్వరగా బలహీన పడుతూ ఉంటారు.

ఇలాంటి వారు కొన్ని రకాల హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి. అలాగే ప్రతి రోజూ వ్యాయామాలు కూడా చేస్తూ ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సహంగా, ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు. మరి ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.

ఉదయాన్నే ప్రోటీన్ షేక్ తాగడం చాలా మంచిది. ఇవి శరీరానికి తక్షణ శక్తి ఇవ్వడమే కాకుండా.. శరీరంలో శక్తి కోల్పోకుండా సహాయ పడుతుంది. కండరాలను బలంగా చేస్తుంది. అలాగే కొబ్బరి నీరు తాగడం వల్ల కూడా శరీరం ఎనర్జిటిక్‌గా ఉంటుంది.

అలసట, నీరసంతో బాధ పడేవారు బీట్ రూట్ జ్యూస్ తాగడం అవసరం. ఇవి మీ స్టామినాను పెంచడానికి, రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి చాలా అసవరం. రక్త పోటును కూడా అదుపులో ఉంచుతుంది. రక్త ప్రసరణను మెరుగు పరిచి చర్మం, శరీరంల ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది,

స్మూతీలు తాగడం కూడా చాలా అవసరం. ఆకు కూరలు, అవకాడో వంటి పండ్లతో చేసిన స్మూతీలు తాగితే చాలా మంచిది. చెర్రీ జ్యూస్ తాగడం వల్ల మీరు ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఇందులో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఈ జ్యూస్ కండరాల నొప్పులను తగ్గిస్తాయి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




