- Telugu News Photo Gallery These tips are the best to prevent ginger from spoiling quickly, Check Here is Details
Kitchen Hacks: అల్లం త్వరగా పాడవకుండా ఉండాలంటే ఈ టిప్స్ బెస్ట్..
అల్లం ఇంట్లో త్వరగా పాడైపోతూ ఉంటుంది. కానీ అల్లాన్ని ఇంట్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పే చిట్కాలు ట్రై చేస్తే ఎక్కువ రోజులు అల్లం పాడకుండా నిల్వ ఉంటుంది..
Updated on: Nov 18, 2024 | 5:13 PM

అల్లం అనేది నిత్యవసర వస్తువు. కిచెన్‌లో అల్లాన్ని విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. అల్లం అనేది ప్రతీ ఇంట్లో వాడుకునే వస్తువు. అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు. చాలా మంది ఎక్కువగా అల్లంతో టీ పెడుతూ ఉంటారు. అల్లం టీ తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది.

అల్లం ఎక్కువగా ఇంట్లో నిల్వ ఉండదని చాలా మంది కొద్దిగా తీసుకొస్తూ ఉంటారు. ఫ్రిజ్‌లో కూడా మరీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. వారం, పది రోజులకే బూజు పట్టేస్తుంది. మరి అల్లం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.

అల్లాన్ని నిల్వ చేయాలంటే పెద్దగా కష్ట పడాల్సిన పని లేదు. అల్లాన్ని ఎప్పుడు కొన్నా తాజాగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇంటికి తీసుకు రాగానే పక్కన పడేయకుండా.. ముందు శుభ్రంగా కడగండి. ఆ తర్వాత చెమ్మ పోయే దాకా బయట ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల అల్లం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

ఇలా క్లీన్ చేసిన అల్లాన్ని ఫ్రిజ్‌లో ఉంచినా రెండు వారాల పాటు పాడవకుండా ఉంటుంది. అల్లాన్ని ఫ్రిజ్‌లో ఉంచేటట్టు అయితే.. గాలి చొరబడని కంటైనర్ లేదా కవర్స్‌లో కట్టి పెట్టాలి.

అల్లం మరిన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.. శుభ్రంగా కడిగి పైన పొట్టు తీసి గాలి తగలని జిప్ లాక్ బ్యాగ్స్, కంటైనర్స్‌లో పెడితే ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది. కాబట్టి తక్కువ రేటు ఉన్నప్పుడే ఎక్కువ కొని తీసుకు రావచ్చు.




