- Telugu News Photo Gallery Cinema photos Tollywood Anchor Ravi house warming ceremony photos go viral
Anchor Ravi: కొత్తింట్లోకి అడుగు పెట్టిన యాంకర్ రవి.. గృహ ప్రవేశం వేడుక ఫొటోలు చూశారా?
యాంకర్ రవి గురించి తెలుగ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సందర్భమేదైనా తన పంచులు, జోకులు, ప్రాసలతో ఆడియెన్స్ ను బాగా ఎంటర్ టైన్ చేస్తుంటాడు రవి. ఇక లాస్యతో కలిసి అతను చేసిన టీవీ షోలు ఓ రేంజ్ లో సక్సెస్ అయ్యాయి.
Updated on: Nov 18, 2024 | 5:10 PM

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ యాంకర్లలో రవి కూడా ఒకరు. పటాస్ కామెడీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి గత పదేళ్లుగా యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు

పటాస్ తో పాటు సమ్‌థింగ్ స్పెషల్, ఆడాళ్లా మజాకా.. తదితర టీవీషోలు యాంకర్ గా రవికి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి

ఇక తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ రియాల్టీ షోలోనూ సందడి చేశాడీ స్టార్ యాంకర్.

అన్ని రకాల ఛానెల్స్ లో టీవీ షోలు, ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీ బిజీగా ఉండే రవి తాజాగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు.

ఈ సందర్భంగా తన భార్య నిత్యా సక్సేనా, కూతురు వియా తదిరులతో కలిసి కొత్త ఇంట్లో హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించాడు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అవి కాస్తా వైరల్ గా మారాయి. పలువురు బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రవికి అభినందనలు చెబుతున్నారు.




