- Telugu News Photo Gallery Cinema photos Nani new movie to Balakrishna guest roles latest film updates from movie industry
Film News: మలయాళ దర్శకుడితో నాని.. కొడుకు సినిమాలో ఆ పాత్రలో బాలయ్య..
నేచురల్ స్టార్ నాని మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సంబందించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. కంగువాకు ఆడియన్స్ నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ తో అలెర్ట్ అయిన మేకర్స్. స్త్రీ 2 సక్సెస్ జోష్‌లో ఉన్న శ్రద్ధా కపూర్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. షాహిద్ కపూర్ హీరోగా ఎనౌన్స్ అయిన మైథలాజికల్ మూవీ అశ్వత్థామని హోల్డ్.
Updated on: Nov 18, 2024 | 4:30 PM

నేచురల్ స్టార్ నాని మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రజెంట్ హిట్ 3లో నటిస్తున్న నాని, పారడైజ్ మూవీతో పాటు సుజిత్ దర్శకత్వంలో సినిమాలకు ఓకే చెప్పారు. ఈ సినిమాలు లైన్‌లో ఉండగానే మలయాళ దర్శకుడు విపిన్ దాస్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నేచురల్ స్టార్.

మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సంబందించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ శ్రీ కృష్ణుడి పాత్రలో కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలపై చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వలేదు.

భారీ అంచనాలు పెట్టుకున్న కంగువాకు ఆడియన్స్ నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. దీంతో అలెర్ట్ అయిన మేకర్స్, డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా సౌండ్ విషయంలో ఎక్కువగా విమర్శలు రావటంతో సౌండ్ లెవల్స్ తగ్గించాలని ఎగ్జిబిటర్లకు సూచించారు.

స్త్రీ 2 సక్సెస్ జోష్‌లో ఉన్న శ్రద్ధా కపూర్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎప్పటి నుంచో చర్చల్లో ఉన్న నాగిన్ మూవీని త్వరలో పట్టాలెక్కించబోతున్నట్టుగా వెల్లడించారు. శ్రీదేవి నటించిన నగినా మూవీ తనకు ఎంతో ఇష్టమన్న శ్రద్ధా, ఇప్పుడు అదే పాత్రలో నటించటం గర్వంగా ఉందన్నారు.

షాహిద్ కపూర్ హీరోగా ఎనౌన్స్ అయిన మైథలాజికల్ మూవీ అశ్వత్థామని హోల్డ్‌లో పెట్టారు మేకర్స్. బడ్జెట్ పరమైన కారణాలతో ఈ సినిమాను పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తోంది. నిర్మాత జాకీ భగ్నాని వరుస ఫెయిల్యూర్స్ కారణంగా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆలోచనలో పడ్డారు.




