- Telugu News Photo Gallery Cinema photos Nayanthara to Rajinikanth film Re release latest movie updates from cinema industry
Movie Updates: సీరియస్ అయిన నయన్.. తలైవ పుట్టినరోజున మరోసారి ఆ సినిమా సందడి..
నయనతార డాక్యుమెంటరీపై తన బ్యానర్‌లో నిర్మించిన సినిమా క్లిప్‌ను అనుమతి లేకుండా వాడినందుకు కోలీవుడ్ హీరో అభ్యంతరం. క్రాష్ కోర్స్‌లా ఉంది అంటున్న శ్రీలీల. ఐఫా కాంట్రవర్సీ విషయంలో క్లారిటీ ఇచ్చారు యంగ్ హీరో తేజ సజ్జ. మ్ చేంజర్ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్. తలైవ పుట్టినరోజున మరోసారి ఆ క్రేజీ సినిమా థియేటర్లలో సందడి.. ఇలాంటి మూవీ అప్డేట్స్ ఏంటో ఈరోజు చూద్దాం..
Updated on: Nov 18, 2024 | 3:46 PM

నయనతార డాక్యుమెంటరీపై కోలీవుడ్ హీరో ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ షోలో తన బ్యానర్‌లో నిర్మించిన నానుమ్ రౌడీదాన్ సినిమా క్లిప్‌ను అనుమతి లేకుండా వాడినందుకు పది కోట్లు చెల్లించాలంటూ కాపీ రైట్ కంప్లయింట్ ఇచ్చారు. ఈ విషయంపై సీరియస్‌గా స్పందించిన నయన్, ధనుష్‌కు ఓపెన్ లెటర్ ద్వారా సమాధానమిచ్చారు.

పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల ఇంకా ఆ ఎగ్జైట్మెంట్‌లోనే ఉన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. ఈ ఐదారు రోజులు బన్నీతో కలిసి వర్క్ చేయటం ఓ క్రాష్ కోర్సులా ఉందన్నారు శ్రీలీల.

ఐఫా కాంట్రవర్సీ విషయంలో క్లారిటీ ఇచ్చారు యంగ్ హీరో తేజ సజ్జ. 'ఐఫా అనేది జాతీయ స్థాయి వేడుక. చాలా మంది స్క్రిప్ట్ రైటర్స్ దీని కోసం వర్క్ చేస్తారు. అంతా ఓకే అనుకున్న తరువాతే ఆ స్క్రిప్ట్ మాకు ఇస్తారు. క్లిప్ చూడటం వల్ల అభిమనులు తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఫుల్ వీడియో చూస్తే అలా ఉండదు' అన్నారు.

గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఈ నెల 20 ఈ సినిమా నుంచి థర్థ సింగిల్ రాబోతుందన్నారు. పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన తమన్ ఈ అప్‌డేట్ ఇచ్చారు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రజనీకాంత్, మమ్ముట్టి, అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఐకానిక్ మూవీ దళపతి. ఈ సినిమాను రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 12న రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 1991లో రిలీజ్ అయిన దళపతి అప్పట్లో సంచలన విజయం సాధించింది.




