- Telugu News Photo Gallery These home remedies are best to reduce swelling in feet, check here is details
Swollen Feet Tips: పాదాల్లో వాపు తగ్గాలంటే ఈ హోమ్ రెమిడీస్ బెస్ట్!
సాధారణంగా అప్పుడప్పుడూ పాదాల్లో వాపు రావడం కామన్ విషయం. ఎక్కువ సేపు నిల్చున్నా, నడిచినా, కూర్చొన్నా ఈ సమస్య కనిపిస్తుంది. గర్భిణీల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అంతే కాకుండా కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వలన కూడా పాదాల వాపు వస్తుంది. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పాదాల్లో నీరు నిలిచిపోయినప్పుడు కూడా పాదాల్లో వాపు వస్తుంది. కానీ నీటిని రెగ్యులర్‌గా ఎక్కువగా తాగుతూ..
Updated on: Sep 27, 2024 | 6:30 PM

సాధారణంగా అప్పుడప్పుడూ పాదాల్లో వాపు రావడం కామన్ విషయం. ఎక్కువ సేపు నిల్చున్నా, నడిచినా, కూర్చొన్నా ఈ సమస్య కనిపిస్తుంది. గర్భిణీల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అంతే కాకుండా కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వలన కూడా పాదాల వాపు వస్తుంది. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

పాదాల్లో నీరు నిలిచిపోయినప్పుడు కూడా పాదాల్లో వాపు వస్తుంది. కానీ నీటిని రెగ్యులర్‌గా ఎక్కువగా తాగుతూ ఉండటం వల్ల వాపు సమస్య తగ్గుతుంది. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల పాదాల్లో నిలిచిపోయిన నీరు కూడా బయటకు వెళ్లిపోతుంది.

పాదాల్లో వాపు తగ్గాలంటే ఈ ఉప్పు చిట్కా చక్కగా పని చేస్తుంది. నీటిని గోరు వెచ్చగా వేడి చేసి.. అందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కరగ బెట్టాలి. ఈ నీళ్లలో కాలు పెట్టడం వల్ల కాళ్ల నొప్పులు అనేది తగ్గుతాయి.

పాదాల వాపు తగ్గాలంటే ఐస్ ప్యాక్ బాగా పని చేస్తుంది. పాదాల్లో వాపు ఉన్న చోట ఐస్‌ని కాటన్ క్లాత్‌లో చుట్టి కాపడం పెట్టాలి. ఇలా చేయడం వల్ల పాదాల్లో ఉండే వాపులు, నొప్పులు కూడా తగ్గుతాయి.

నిమ్మరసం తాగడం వలన కూడా పాదాల్లో ఉండే వాపు అనేది తగ్గుతుంది. శరీరంలో ఉండే ట్యాక్సిన్స్, అదను ద్రవాలను తొలగించడంలో నిమ్మరసం చక్కగా పనిచేస్తుంది. నిమ్మరసాన్ని తాగితే పాదాల వాపు చాలా వరకు కంట్రోల్ అవుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




