AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Seaside Monuments: భారత్‎లో సముద్రతీర స్మారక చిహ్నాలు ఇవే.. తప్పక ఎక్సప్లోర్ చేయాలి..

భారతదేశం పొడవైన, అందమైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది.  తీరం వెంబడి కొన్ని అద్భుతమైన వారసత్వ ప్రదేశాలను కనుగొనవచ్చు. పురాతన దేవాలయాల నుండి గొప్ప కోటల వరకు, ఈ ప్రదేశాలు ప్రశాంతంగా, చారిత్రాత్మకంగా ఉంటాయి. చారిత్రాత్మక ప్రదేశాలను చూడవచ్చు. మరి ఇండియాలో సముద్రతీరంలో ఉన్న టాప్ స్మారక చిహ్నాలు ఏంటి.? ఈ స్టోరీలో చూద్దాం రండి.. 

Prudvi Battula
|

Updated on: Jun 07, 2025 | 1:40 PM

Share
షోర్ టెంపుల్, మహాబలిపురం, తమిళనాడు: మహాబలిపురంలోని షోర్ టెంపుల్ దక్షిణ భారతదేశంలోని పురాతన రాతి ఆలయాలలో ఒకటి. ఇది 8వ శతాబ్దంలో బంగాళాఖాతం ఒడ్డున నిర్మించబడింది. రాతి గోడలపై చెక్కడాలు చాలా హిందూ పురాణాల దృశ్యాలను వివరంగా చూపుతాయి. ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా చేసేది ఏమిటంటే ఇది సముద్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. దీన్ని కచ్చితంగా చూడాలి.

1 / 5
గేట్‌వే ఆఫ్ ఇండియా, ముంబై, మహారాష్ట్ర: గేట్‌వే ఆఫ్ ఇండియా ముంబైలో సందర్శించడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రదేశాలలో ఒకటి. దీనిని బ్రిటిష్ పాలనలో నిర్మించారు. అరేబియా సముద్ర తీరంలో ఉంది. ఈ పెద్ద ఒక రాతి తోరణం. చరిత్రలో ముఖ్యమైనది మాత్రమే కాదు, స్థానికులు, పర్యాటకులు విశ్రాంతి తీసుకోవడానికి, సముద్ర దృశ్యాలను ఆస్వాదించడానికి అనువైన ప్రదేశం. చాలా మంది సాయంత్రం సూర్యాస్తమయాన్ని చూడటానికి ఇక్కడికి వస్తారు. ఎలిఫెంటా గుహలకు ఇక్కడ నుంచి పడవ ప్రయాణం చేయవచ్చు.

2 / 5
ఫోర్ట్ అగ్వాడా, గోవా: మీరు గోవా సందర్శిస్తుంటే ఫోర్ట్ అగ్వాడా కచ్చితం చుడండి. ఈ కోటను 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారు నిర్మించారు. ఇది అరేబియా సముద్రం మీదుగా కనిపించే కొండపై ఉంది. కోట నుండి విశాలమైన దృశ్యం చాలా అందంగా ఉంటుంది. ఈ ప్రదేశాన్ని మరింత ఆసక్తికరంగా మార్చే ఎత్తైన లైట్‌హౌస్ కూడా ఉంది. ఈ కోటలో పెద్ద బహిరంగ ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ మీరు నడుస్తూ సముద్రంపై వీచే గాలిని ఆస్వాదించవచ్చు. ఫోటోలు తీయడానికి ఫొటోగ్రాఫర్లకు అనువైన ప్రదేశం.

3 / 5
బెకల్ కోట, కేరళ: బెకల్ కోట కేరళలోని అతిపెద్ద కోటలలో ఒకటి. ఇది సముద్రం పక్కనే ఉంది. ఈ కోట బలమైన రాతి గోడలను అలల తాకినప్పుడు మనోహరమైన అనుభూతి కలుగుతుంది. కోటపై నుంచి సముద్ర దృశ్యం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి చాలా దూరం వరకు సముద్రాన్ని చూడవచ్చు. కోట కూడా శుభ్రంగా, బాగా నిర్వహించబడుతుంది. ఇది కుటుంబాలకు, ఒంటరి ప్రయాణికులకు మంచి ఎంపిక.

4 / 5
డయ్యూ కోట, డయ్యూ: డయ్యూ కోట ప్రశాంతమైన ప్రదేశం. దీనిని పోర్చుగీసు వారు నిర్మించారు. ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉండదు. కాబట్టి మీరు ప్రశాంతమైన ప్రదేశాలను ఇష్టపడితే ఇది మరింత బాగుంటుంది. ఈ కోట అరేబియా సముద్రతీరంలో ఉంది. పాత వాచ్ టవర్లు. విశాలమైన రాతి మార్గాలను కలిగి ఉంది. మీరు గోడలపై నిలబడి సముద్ర ప్రకృతి దృశ్యాలు ఆస్వాదించవచ్చు. 

5 / 5