- Telugu News Photo Gallery World photos These are the top 5 cleanest rivers in the world, a must see for the stunning scenery
Cleanest Rivers: టాప్ 5 స్వచ్ఛమైన నదులు ఇవే.. అద్భుత దృశ్యాన్ని చూడాల్సిందే..
ప్రపంచంవ్యాప్తంగా అనేక నదులు ప్రవహిస్తున్నాయి. వాటిలో కొన్ని స్పటిక-స్పష్టమైన నీరు, ప్రకృతి అందానికి ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. ఈ నదులు ప్రకృతి ప్రేమికులకు, ప్రయాణికులకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. మరి ప్రపంచంలోని టాప్ 5 పరిశుభ్రమైన నదులు ఏంటి.? ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Updated on: Jun 07, 2025 | 1:07 PM

థేమ్స్ నది, యునైటెడ్ కింగ్‌డమ్: లండన్‌లోని థేమ్స్ నది ఒకప్పుడు చాలా మురికిగా ఉండేది. కానీ ఇప్పుడు అది ప్రపంచంలోని అత్యంత పరిశుభ్రమైన నగర నదులలో ఒకటిగా ఉంది. ఇది అనేక రకాల చేపలు, పక్షులకు నిలయంగా విలసిల్లుతుంది.

సెయింట్ లారెన్స్ నది, కెనడా: ఈ నది కెనడా, యునైటెడ్ స్టేట్స్ మధ్య ప్రవహిస్తుంది. దీనిలో స్వచ్ఛమైన నీరు ఉంది. సముద్ర జీవులతో నిండి ఉంది. ప్రజలు దీనిని కాపాడుకొంటూ వస్తున్నారు. ఈ నది కాలుష్యాన్ని ఆపడానికి అనేక నియమాలు అనుసరిస్తున్నారు.

లి నది, చైనా: చైనాలోని లి నది దాని స్వచ్ఛమైన నీరు, దాని చుట్టూ ఉన్న అందమైన పర్వతాలకు ప్రసిద్ధి చెందింది. ఇది ప్రకృతి ప్రేమికులకు, ఫోటోగ్రాఫర్లకు బెస్ట్ ఆప్షన్. ఈ నది వద్ద తీసుకున్న ఫోటోలు చిరకాలం నిల్చిపోతాయి. ఇక్కడకి జీవితంలో ఒక్కసారైన వెళ్ళాలి.

తారా నది, మోంటెనెగ్రో: తారా నది లోతైన లోయలు, పచ్చని అడవుల గుండా ప్రవహిస్తుంది. ఇది ఒక జాతీయ ఉద్యానవనంలో భాగం. దీనికి దగ్గరగా ఎటువంటి కర్మాగారాలు లేదా నగరాలు లేనందున చాలా శుభ్రంగా ఉంటుంది. ఇక్కడ రివర్ రాఫ్టింగ్ మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుంది.

టోర్న్ నది, స్వీడన్ అండ్ ఫిన్లాండ్: టోర్న్ నది స్వీడన్, ఫిన్లాండ్ మధ్య సహజ సరిహద్దు. దీనికి సమీపంలో చాలా తక్కువ పరిశ్రమలు ఉండటం, ఈ ప్రాంతంలో ప్రజలు ప్రకృతిని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ఇది శుభ్రంగా ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు ఈ చాలా బాగా నచ్చుతుంది.

సోకా నది, స్లోవేనియా: సోకా నది దాని స్పష్టమైన నీలం-ఆకుపచ్చ నీటికి ప్రసిద్ధి చెందింది. ఇది పర్వతాల గుండా ప్రవహిస్తుంది. చాలా శుభ్రంగా ఉంటుంది. ప్రజలు చేపలు పట్టడం, జల క్రీడల కోసం ఇక్కడికి వస్తారు. ఇది ప్రకృతి ప్రయాణికులను ఆకర్షిస్తుంది.




