ద్యావుడా..కనురెప్పలపై చుండ్రు..జాగ్రత్తపడకపోతే కష్టమే!
చుండ్రు అంటే చాలు అందరికీ ముందుగా గుర్తు వచ్చేది తల. కానీ తలపైనే కాదండో కను రెప్పలపై కూడా చుండ్రు వస్తుంది. ఇది చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కను రెప్పలపై ఉండే చుండ్రు ఎక్కువగా కనిపించదంట. కానీ దీని ప్రభావం మాత్రం కళ్లపై తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. కాగా, కనురెప్పలపై చుండ్రు ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం.
Updated on: Jul 12, 2025 | 11:57 AM

కనురెప్పలపై చుండ్రు అనేది కంటి రెప్పలపై బ్యాక్టీరియా పేరుకపోయినప్పుడు వస్తుందంట. అంతే కాకుండా ఆయిల్ ఫేస్, పొడి కళ్ల వంటి సమస్యలు ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందంట. కనురెప్పలపై చుండ్రు ఉన్నప్పుడు కంటిపై తెలుపు లేదా పసుపు రంగు పొరలు, దురద, కళ్లు ఎర్రగా మారడం, చూపు మందగించడం, కాంతిని సరిగ్గా చూడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు కళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంట. రోజూ గోరు వెచ్చటి నీటిలో తడి గుడ్డ వేసి రోజుకు కనీసం ఐదు నుంచి పది నిమిషాల పాటు కాట్ క్లాత్‌తో కళ్లను శుభ్ర పరుచుకోవాలంట. దీని వలన కనురెప్పలపై చుండ్రు సమస్య నుంచి కాస్త ఉపశమనం కలుగుతుందంట. ఒక వేళ ఈ కనురెప్పలపై చుండ్రు సమస్య తీవ్రతరం అవుతే ఇది కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందంట.

ఈ కనురుప్పలపై చుండ్రు వలన కంటి ఇన్ఫెక్షన్స్, పొడి కళ్లు, సైట్ వంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సార్లు ఈ లక్షణాలు తీవ్రతరమైతే కార్నియల్ దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంట. అందువలన ప్రమాదాన్ని పరిశీలించి, వైద్యుడిని సంప్రదిచాలంట. ముఖ్యంగా సమస్య పెరగకూడదంటే, తప్పకుండా కనురెప్పల శుభ్రత పాటించడమే కాకుండా, కళ్ల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు శ్రద్ధ వహించాలంట.

కొంత మంది మేకప్ వేసుకున్న తర్వాత పడుకునే ముందు కళ్లను శుభ్రం చేసుకోరు. అలానే నిద్రపోవడం వలన కనురెప్పల మధ్య చుండ్రు సమస్య అనేది తీవ్రతరం అవుతుందంట. దీంతో కళ్లు ఎర్రగా మారడం, దురద పెట్టడం వంటి సమస్యలు ఎక్కువ అవుతాయంట. అలాగే కనురెప్పల వెంట్రకులు రాలిపోయే ఛాన్స్ ఉన్నదంట. అందుకే మేకప్‌ను ఎప్పటికప్పుడు తొలిగించుకుని, కళ్లను శుభ్రపరుచుకుంటూ ఉండాలంట. దీని వలన కనురెప్పలపై చుండ్రు సమస్య కొంత మేర తాగుతుందంట.