- Telugu News Photo Gallery Business photos Avenue Supermarts Shares Fall 4 Percent After DMart Posts Q1 Results, Details Here
DMart: డీమార్ట్‌లో తెగ షాపింగ్ చేస్తున్నారా? ఈ ఒక్కటి తెలిస్తే డిస్కౌంట్ కంటే ఎక్కువే..
డీ మార్ట్‌లో డిస్కౌంట్లు ఎక్కువగా ఉన్నాయని తెగ షాపింగ్ చేస్తున్నారా.? అయితే కొంచెం ఆగండి. ఈ వార్త చదివేయండి. ఈ ఒక్క పని చేస్తే.. డిస్కౌంట్లు కంటే ఎక్కువగా డబ్బు ఆదా చేయవచ్చు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఆ వివరాలు..
Updated on: Jul 12, 2025 | 10:33 AM

డీమార్ట్.. బట్టలు, పండ్లు, నిత్యావసర వస్తువులు.. ఇలా దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు. డిస్కౌంట్లు, 1+1 ఆఫర్లు లాంటివి పెట్టి కస్టమర్లను ఆకర్షిస్తుంది. ప్రతీ వారం నార్మల్‌గా ఇంటి షాపింగ్ చేయడం వరకు ఓకే.. ఆఫర్లు పెట్టారు కదా అని తెగ షాపింగ్ చేస్తుంటే.. ఓసారి ఇది చూడండి.

డీమార్ట్‌లో ఆఫర్లు ఉన్నాయ్ కదా అని.. ఎగబడి కొనే బదులు.. డీమార్ట్ షేర్స్‌ను మీరు కొంటే.. డబ్బులు డబుల్ అవ్వడం ఖాయం. అదెలా అని అనుకుంటున్నారా.. ప్రస్తుతం డీమార్ట్(అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్) షేర్ రూ. 4070.20గా ఉంది.

గత వారం రోజుల్లో అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితలు కారణంగా ఈ షేర్ ధర డ్రాప్ అవుతోంది. సుమారు రూ. 213.90 మేరకు తగ్గింది. మీరు ఈ షేర్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. కేవలం ఆరు నెలలలోనే డబ్బులు డబుల్ అవ్వడం ఖాయం.

ప్రస్తుతం షేర్ వాల్యూ డౌన్‌సైడ్ ఉన్నప్పటికీ.. కచ్చితంగా వచ్చే ఆరు నెలలలో ఇది మళ్లీ పెద్ద బుల్ రన్ ఇవ్వడం ఖాయం. అలాగే Q1 ఫలితాలు వచ్చాక.. షేర్ కచ్చితంగా దూసుకుపోతుందని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

ఈ షేర్ 52 వీక్ హై నుంచి ప్రస్తుతం డౌన్ ట్రెండ్‌లో ట్రేడ్ అవుతోంది. కానీ మరో ఆరు నెలల్లోనే సరికొత్త 52 వీక్ హై టచ్ అవ్వడం ఖాయం అని చెబుతున్నారు. డీమార్ట్ గత 52 వీక్ హై 5484.85గా ఉంది.




