- Telugu News Photo Gallery These are the ingredients that should be taken to overcome the ill effects of magnesium deficiency on the body
బీ ఆలర్ట్.. శరీరంలో ఈ విటమిన్ లోపం వల్ల కలిగే అనర్థాలు ఇవే..
శరీరంలో ఏ ఒక్క విటమిన్లు, మినరల్స్ సంపూర్ణంగా లేకపోయినా అనేక అనారోగ్యాలకు కారణం అవుతాయి. అందుకే వీటిని అధిగమించడం కోసం అనేక ప్రొడక్టులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని మితంగా తీసుకోవడం వల్ల ఉపయోగంగా ఉంటుంది కానీ అతిగా తీసుకుంటే అనేక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
Updated on: Jun 29, 2024 | 7:56 PM

శరీరంలో ఏ ఒక్క విటమిన్లు, మినరల్స్ సంపూర్ణంగా లేకపోయినా అనేక అనారోగ్యాలకు కారణం అవుతాయి. అందుకే వీటిని అధిగమించడం కోసం అనేక ప్రొడక్టులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని మితంగా తీసుకోవడం వల్ల ఉపయోగంగా ఉంటుంది కానీ అతిగా తీసుకుంటే అనేక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుత యుగంలో ప్రతి ఒక్కరూ సరైన పౌష్టికరమైన ఆహారాలపై శ్రద్ద చూపించడం లేదు. దీని కారణంగా ముప్పై ఏళ్లకే కీళ్ళ నొప్పులు, తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట, నడుము నొప్పులు, నిద్రలేమి వంటి సమస్యలు వచ్చేస్తున్నాయి. దీంతో తరచూ డాక్టర్లను సంప్రదిస్తూ సంపాదించింది మొత్తం వాటికే ఖర్చు చేస్తు్న్నారు.

వీటిని అధిగమించడం కోసం మనం నిత్యం తీసుకునే ఆహారంలో అనేక రకాల విటమిన్లతో పాటు ఈ రెండు ముఖ్యంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ప్రతిరోజూ ఉత్తేజంగా, ఉల్లాసంగా రోజు ప్రారంభించి రాత్రి నిద్ర కూడా బాగా పట్టేందుకు దోహదపడుతుందని సూచిస్తున్నారు. ఈ రెండు విటమిన్లు మన శరీరంలో తక్కువైతే అనేక అనారోగ్య సమస్యలు వచ్చి వాలతాయి.

ముఖ్యంగా మెగ్నీషియం శరీరంలో అధికంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ప్రోటీన్స్ నుంచి మనకు శక్తి వచ్చేలా చేయడంలో ఇది ప్రధాన భూమిక పోషిస్తుంది. ఇది మంచి శక్తితోపాటు చక్కటి నిద్ర పట్టేలా చేస్తుంది. మన రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. తద్వారా హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయంటున్నారు. అప్పుడు మనిషి చురుగ్గా పనిచేసి హాయిగా నిద్రపోగలుగుతారని చెబుతున్నారు పలువురు శాస్త్రవేత్తలు.

అదే శరీరంలో మెగ్నీషియం తగినంత లేకపోతే అనేక దుష్ప్రభావాలనకు, అనర్థాలకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే ఈ విటమిన్ మనకు పుష్కలంగా అందాలంటే చాక్లెట్లు, పీచు పదార్థాలు, గ్రీన్ పీస్, ఆకుకూరలు, పండ్లు నిత్యం తీసుకోవడం ఉత్తమం అంటున్నారు వైద్య నిపుణులు.




