- Telugu News Photo Gallery Technology photos These are the best 5G phones below 35k, check details in telugu
Best 5G Phones Under 35K: మిడ్ రేంజ్లో టాప్ 5జీ ఫోన్లు ఇవే.. బెస్ట్ బ్రాండ్లు.. టాప్ ఫీచర్లు..
నేడు ప్రతి చిన్న పనికీ స్మార్ట్ ఫోన్ చాలా అవసరం. ఆ పని వేగంగా, సజావుగా పూర్తవ్వడం కూడా ముఖ్యమే. అందుకే మనం ఎంపిక చేసుకునే ఫోన్లు మన్నికతో పాటు వేగంగా పనిచేసేలా చూసుకోవాలి. ప్రస్తుతం మార్కెట్ లో 5జీ స్మార్ట్ ఫోన్లు సందడి చేస్తున్నాయి. కొత్తగా ఫోన్ కొనుగోలు చేసేవారితో పాటు 4జీ వినియోగదారులు కూడా వీటిని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. రూ.35 వేల లోపు 5జీ స్మార్ట్ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా లేటెస్ట్ ఫీచర్లు, మంచి నాణ్యత, వేగవంతమైన పనితీరుతో ఆకట్టుకుంటున్నాయి. డిస్ ప్లే, ప్రాసెసర్, కెమెరా, పనితీరు ఇలా ప్రతి విషయంలో బెస్ట్ గా నిలుస్తున్నాయి. ఫోన్ కోసం మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయికీ తగిన విధంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తాయి. అమెజాన్ లో అందుబాటులో ఉన్న వివిధ బ్రాండ్ల 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే.
Updated on: Jun 29, 2024 | 6:24 PM

రెడ్ మీ నోట్ 13 ప్రోప్లస్(Redmi Note 12 Pro +).. ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్ చాలా అద్భుతంగా ఉంటుంది. 200 ఎంపీ ప్రధాన కెమెరాతో ఫొటోలను చక్కగా తీసుకోవచ్చు. ఇది యాంటీ-షేకింగ్ పనితీరుతో ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ లో 6.67 అంగుళాల క్రిస్టల్ రీస్ అమోలెడ్ డిస్ ప్లే, మీడియా టెక్ డైమన్సిటీ 700 అల్ట్రా ప్రాసెసర్, ఎమ్ఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్, 8 జీబీ, 12 జీబీ ర్యామ్, అలాగే 256 జీబీ, 512 జీబీ స్టోరేజీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. 120 డబ్ల్యూ హైపర్ చార్జింగ్ కి సపోర్టు చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. 200 ఎంపీ+ 8 ఎంపీ+ 2 ఎంపీ రీర్ కెమెరా, 16 ఎంపీ బ్యాక్ కెమెరాతో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ ధర రూ.30,999.

సామ్సంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ(Samsung Galaxy S21 FE 5G).. కొత్తగా 5జీ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి సామ్సంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ మంచి ఎంపిక. దీనిలోని 6.4 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే కారణంగా విజువల్ చాలా స్పష్టంగా చూడవచ్చు. 12 ఎంపీ ప్రధాన, 12 ఎంపీ అల్ట్రావైడ్, 8 ఎంపీ టెలిఫోటో కెమెరాలతో అద్భుతమైన చిత్రాలను తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కెమెరా సెటప్ 30ఎక్స్ స్పేస్ జూమ్‌ను అందిస్తుంది. ఇక సెల్ఫీల కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఎక్సినోస్ 2100 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12.0 ఆపరేటింగ్ సిస్టమ్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.31,398.

వన్ ప్లస్ 11ఆర్ 5జీ(OnePlus 11R 5G).. ఈ ఫోన్ లోని 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా సిస్థమ్ తో స్పష్టమైన ఫొటోలను తీసుకోవచ్చు. దీనిలోని డైనమో కెమెరా సిస్టమ్ మంచి పనితీరును కనబరుస్తుంది. 6.7 అంగుళాల డిస్ ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, ఆక్సిజన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. రీర్ కెమెరాలో 50 ఎంపీ ప్రధాన, 8 ఎంపీ ఆల్ట్రావైడ్, మైక్రో లెన్స్, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా అమర్చారు. ఈ ఫోన్ రూ.27,999కు అందుబాటులో ఉంది.

రియల్ మీ జీటీ 6టీ 5జీ(realme GT 6T 5G).. ఫోన్ ను బాగా ఎక్కువగా ఉపయోగించేవారికి రియల్ మీ జీటీ 6టీ 5జీ మంచి ఎంపిక. దీనిలో మల్టిపుల్ టాస్క్ లు, హెవీ సాఫ్ట్ వేర్ లను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆపరేట్ చేయవచ్చు. ముఖ్యంగా ఈ ఫోన్ కు హయ్యెస్ట్ స్టాండర్డ్ గేమింగ్ ఫెర్ఫార్మెన్స్ ఉంది. 6.78 అంగుళాల డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఆధారపడి పని చేస్తుంది. 8 జీబీ, 12 జీబీ ర్యామ్, 128 జీబీ, 256 జీబీ స్టోరేజీతో అందుబాటులో లభిస్తుంది. 5500 ఎంఏహెచ్ బ్యాటరీతో చార్జింగ్ ఇబ్బందులు ఉండవు. 50 ఎంపీ+ 8ఎంపీ+ 2 ఎంపీ రీర్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఫొటోలను చక్కగా తీసుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర రూ.32,999

ఐక్యూ నియో9 ప్రో 5జీ(IQOO Neo9 pro 5G).. ఈ ఫోన్ పనితీరు చాలా వేగవంతంగా ఉంటుంది. 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే తో విజువల్ స్పష్టంగా చూడవచ్చు. స్నాప్ డ్రాగన్ 8జెన్ 2 మొబైల్ ప్లాట్ ఫాం ప్రోసెసర్, ఆండ్రాయిడ్ 14 బేస్ డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టమ్, 8 జీబీ, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. 5040 ఎంఏహెచ్ బ్యాటరీతో చార్జింగ్ అయిపోతుందనే సమస్య ఉండదు. ట్రిపుల్ కెమెరా సెటప్ తో పాటు ఫ్రంట్ 50 ఎంపీ కెమెరా ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ 34,998కి అందుబాటులో ఉంది.




