- Telugu News Photo Gallery Technology photos Amazon offering huge discount on Redmi 13c smartphone Check here for full details
Redmi 13C: రూ. 12 వేల ఫోన్ రూ. 7500కే.. 50 ఎంపీ కెమెరాతో పాటు మరెన్నో ఫీచర్స్
ఈ కామర్స్ సంస్థలు ఆఫర్స్‌ను ప్రకటించడం సర్వసాధారణమైన విషయం. అయితే కేవలం పండగల సమయంలోనే డిస్కౌంట్స్‌ను ప్రకటిచే సంస్థలు ప్రస్తుతం పండగలతో సంబంధం లేకుండా ఆఫర్లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా రెడ్‌మీ 13సీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Jun 28, 2024 | 8:48 PM

రెడ్‌మీ 13సీ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 11,999గా ఉండగా, 36 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 7698కి సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 350 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ లెక్కన రూ. 12 వేల స్మార్ట్ ఫోన్‌ను రూ. 7500కే సొంతం చేసుకోవచ్చన్నమాట. ఇక రెడ్‌మీ 13సీ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు.

రెడ్‌మీ13 సీ స్మార్ట్ ఫోన్‌లో 4జీ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్, ఎమ్‌ఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మెమోరీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక ఈ ఫోన్‌లో 6.74 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను అందించారు. 600 నిట్స్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం.

కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. క్లాసిక్ ఫిలిమ్ ఫిల్టర్స్, ఫ్రేమ్ హెచ్‌డీఆర్, వాయిస్ షటర్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు.




