- Telugu News Photo Gallery These are the foods you should include in your diet if you suffering from thyroid in telugu
Thyroid Diet Tips: థైరాయిడ్ బాధితులు ఈ డైట్ టిప్స్ పాటించాల్సిందే.. రోజువారీ ఆహారంలో ఏం ఉండాలంటే..
Food: నేడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. పురుషుల కంటే స్త్రీలే ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రతిరోజూ థైరాయిడ్ మందులు తీసుకోవడంతో పాటు, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడే కొన్ని ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకోవాలి.
Updated on: Jun 08, 2022 | 10:35 PM

అల్లం థైరాయిడ్‌కు సులభమైన ఇంటి నివారణలలో ఒకటి. అల్లంలో పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఇన్‌ఫ్లమేషన్‌తో పోరాడడానికి సహాయపడతాయి. థైరాయిడ్ సమస్యలకు అల్లం టీ తాగవచ్చు.

చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. థైరాయిడ్ రోగుల డైట్‌లో ఇవి ఖచ్చితంగా ఉండాలి.

రోజువారీ ఆహారంలో నట్స్ అండ్ సీడ్స్‌ను చేర్చుకోవడం ద్వారా పలు వ్యాధులను తగ్గించుకోవచ్చు. థైరాయిడ్ బాధితులు బాదం, జీడిపప్పు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలను ఎక్కువగా తీసుకోవాలి.

మహిళల ఆరోగ్యానికి పెరుగు చాలా మేలు చేస్తుంది. శరీరంలో అయోడిన్ సరైన స్థాయుల్లో ఉండాలంటే పెరుగు ఎక్కువగా తీసుకోవాలి.

గుడ్డులోని తెల్లసొనతో పాటు, పచ్చసొనలో థైరాయిడ్‌ను నియంత్రించడంలో సహాయపడే పోషకాలు ఉన్నాయి. అదేవిధంగా గుడ్లలో ఎక్కువ మొత్తంలో సెలీనియం, అయోడిన్ కూడా సమృద్ధిగా ఉంటాయి. థైరాయిడ్ బాధితులు వీటిని తప్పకుండా తీసుకోవాలి.

నేడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. పురుషుల కంటే స్త్రీలే ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రతిరోజూ థైరాయిడ్ మందులు తీసుకోవడంతో పాటు, ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.





