Jnr ఎన్టీఆర్ ఇన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ వదులుకున్నాడా!
జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వరస సినిమాలతో పాన్ ఇండియా లెవల్‌లో దూసుకెళ్తున్నాడు. వరసగా హిట్స్ అందుకుంటూ, తన నటనతో దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఇక దేవర మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ హీరో త్వరలో వార్ 2తో అభిమానుల ముందుకు రానున్నారు. ఈ క్రమంలోనే ఈయనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే?
Updated on: Jul 17, 2025 | 11:28 AM

తారక్ ఎన్నో హిట్ సినిమాలు చేశారు. ఈయన చేసిన సినిమాల్లో చాల వరకు హిట్స్ , కొన్ని సినిమాలు ఫ్లాప్ టాక్ అందుకున్నాయి. అయితే చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు తమ తమ వ్యక్తిగత కారణాల వలన కొన్ని సినిమాలు వదులు కోవాల్సి వస్తుంది. వారు రిజక్ట్ చేసిన సినిమాలు కొన్ని సార్లు హిట్ అవుతే మరికొన్ని సార్లు ఫ్లాప్ అవుతాయి.

అయితే అలాగే జూనియర్ ఎన్టీర్ రిజక్ట్ చేసిన సినిమాల్లో పలు మూవీస్ ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయంట. కాగా, ఇప్పుడు మనం తారక్ వదలుకున్న సినిమాలు ఏవో చూసేద్దాం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా ఇలియాన హీరోయిన్‌గా చేసిన సినిమా కిక్. ఈ మూవీ రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కాగా, ఈ మూవీ మొదట తారక్ అనుకోగా, ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా ఈ మూవీని రిజక్ట్ చేశాడంట.

అదే విధంగా, అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీస్‌లో ఆర్య ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లవ్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకుంది. కాగా, ఈ సినిమాలో దర్శకుడు సుకుమార్ తారక్‌ని తీసుకుందాము అనుకోగా, ఆయన పలు కారణాలతో ఈ మూవీని రిజక్ట్ చేశాడంట. అలా అల్లు అర్జున్ చేతికి ఈ మూవీ వెళ్లింది. దీంతో బన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

ఇవే కాకుండా, నితిన్, వివివినాయక్ కాంబోలో వచ్చిన దిల్, ఎవడు సినిమా, రవితేజ బ్లాక్ బస్టర్ మూవీస్ లలో ఒకటైన కృష్ణ, కళ్యాణ్ రామ్ అతనొక్కడే, నాగార్జున, కార్తీ కాంబోలో వచ్చిన ఊపిరి, భద్ర, ఈ సినిమాలన్నింటిని తారక్ వదులుకున్నాడంట. కాగా, ఈ విషయం తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తారక్ ఈ సినిమాలు చేసి ఉంటే, తన రేంజ్ మరోలా ఉండేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.