- Telugu News Photo Gallery The Rameswaram Express has stopped due to a crack in the rail at Puthalapattu
Rameswaram Express: రైల్వే ట్రాక్‌కి క్రాక్.. తప్పిన పెను ప్రమాదం..
ఈరోజు పూతలపట్టు వద్ద రైలు పట్టాకు క్రాక్ ఏర్పడింది. దీనిని ముందుగా గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్‌కు క్రాక్‌ను గుర్తించింది రైల్వే సిబ్బంది. అదే సమయంలో రామేశ్వరం నుంచి తిరుపతికి వెళ్తున్న ట్రైన్ నెంబర్ 16780 రామేశ్వరం ఎక్స్ ప్రెస్‌ను నిలిపి వేశారు. రైల్వే ట్రాక్‌కు వెల్డింగ్ పనులు పూర్తిచేశారు పాకాల రైల్వే సిబ్బంది. మరమ్మత్తుల అనంతరం తిరుపతికి బయలుదేరింది.
Raju M P R | Edited By: Srikar T
Updated on: Nov 27, 2023 | 1:21 PM

రైల్వే ట్రాక్‌కు వెల్డింగ్ పనులు పూర్తిచేశారు పాకాల రైల్వే సిబ్బంది. సుమారు 30నిమిషాలు నిలిపివేసిన రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ మరమ్మత్తుల అనంతరం తిరుపతికి బయలుదేరింది.

ప్రమాదానికి గురి కాకుండా వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది లోకో పైలట్‌కు సమాచారం అందించారు. దీంతో లోకో పైలట్ రైలును ఎక్కడికక్కడ నిలిపవేశారు. రామేశ్వరం ఎక్స్ ప్రెస్‌ను మార్గం మధ్యలో ఆపి యుద్దప్రాతిపదికన మరమ్మతులు చేపట్టింది.

రైల్వే ట్రాక్‌కు క్రాక్‌ను గుర్తించింది రైల్వే సిబ్బంది. అదే సమయంలో రామేశ్వరం నుంచి తిరుపతికి వెళ్తున్న ట్రైన్ నెంబర్ 16780 రామేశ్వరం ఎక్స్ ప్రెస్‌ను నిలిపి వేశారు.

ఈరోజు పూతలపట్టు వద్ద రైలు పట్టాకు క్రాక్ ఏర్పడింది. పూతలపట్టు మండలం పి.కొత్తకోట వద్ద రైలు పట్టాలకు పగుళ్లు వచ్చాయి. దీనిని ముందుగా గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈమధ్య కాలంలో అనేక సాంకేతిక కారణాల వల్ల రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నియంత్రించేదుకు రైల్వే శాఖ అనేక ప్రణాళికలు చేపడుతున్నప్పటికీ అదుపులోకి రావడం లేదు.





























