- Telugu News Photo Gallery The historic battle that took place in Vizianagaram district of Andhra Pradesh was fought between whom?
Vizianagaram Battle: ఆంధ్రలోని విజయనగరంలో చారిత్రక యుద్ధం.. ఏంటది.? ఎవరి మధ్య.?
విజయనగరం.. దీనిని విద్యల నగరంగా కూడా పిలుస్తారు. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలో ఓ జిల్లా. సంగీత దర్శకులు గంటసాల గారు సంగీతం నేర్చుకున్న ప్రదేశం. గురజాడ అప్పారావు లాంటి కవులు సొంత ప్రదేశం.. అలాంటి ఈ జిల్లాలో ఓ చారిత్రక యుద్ధం జరిగింది. మరి ఆ యుద్ధం ఏంటి.? ఈరోజు మనం తెలుసుకుందాం రండి..
Updated on: Jun 01, 2025 | 11:25 AM

24 జనవరి 1757న జనరల్స్ డి బుస్సీ, పూసపాటిల సంయుక్త సైన్యాలు బొబ్బిలి కోట వైపు కవాతు చేశాయి. బొబ్బిలి రాజు గోపాలకృష్ణ రాయుడికి ప్రముఖ జనరల్ తాండ్ర పాపారాయుడు ఉన్నాడు. పాపారాయుడు తాత్కాలిక నివాసం రాజం వద్ద ఉన్నందున ఆవైపుగా బొబ్బిలికి చేరుకోవడం అసాధ్యమని ఫ్రెంచ్ జనరల్‌కు తెలుసు. అందువలన అతను వేరే మార్గాన్ని ఎంచుకున్నాడు. విజయనగరం మహారాజు రాజా రంగరాయలు భార్య, పాపారాయుడు సోదరి రాణి మల్లమ్మ దేవి అతనికి ముందుగా వారి రాకని హెచ్చరిస్తూ సందేశం పంపింది. అయితే, కొరియర్‌ను అడ్డగించగా.. ఆ ముఖ్యమైన సందేశం పాపారాయుడికి చేరుకోలేదు.

ఇంతలో రంగరాయలు, అతని సైనికులు కోటను చుట్టుముట్టగా గోపాలకృష్ణ రాయుడు గంటలు పాటు పోరాడిన ఓడిపోతాడు. స్త్రీలు, పిల్లలు అందరిని రంగరాయలు హతమార్చాడు. రాణి మల్లమ్మ దేవి ఆత్మహత్య చేసుకుంది. ఈ వార్త చేరగానే తాండ్ర పాపారాయుడు కోట వద్దకు పరుగెత్తాడు. అతని సోదరి, మొత్తం కుటుంబం రక్తపు మడుగులో నేలపై పడి ఉండటం చూశాడు. ప్రతీకారంతో రగిలిపోతున్న అతను రంగరాయలుని చంపుతానని అక్కడే ప్రమాణం చేశాడు.

తన శత్రువును నాశనం చేసినందుకు తన విజయ వైభవంలో మునిగిపోతూ తన కోటలో విశ్రాంతి తీసుకున్నాడు రాజా రంగరాయలు. అతను నిద్రిస్తున్న సమయంలో తాండ్ర పాపారాయుడు, తన సహచరులు దేవులపల్లి పెద్దన్న, బుద్దరాజు వెంకయ్యతో కలిసి, శిబిరంలోని భద్రతను తప్పించుకుని రంగరాయలు డేరాకు చేరుకున్నాడు.

పాపారాయుడు వెనుక నుండి ప్రవేశించగా, అతని సహచరులు ప్రవేశద్వారం వద్ద కాపలాగా నిలబడ్డారు. అతను తన బద్ధ శత్రువును మేల్కొలిపగా ఆశ్చర్యపోయడు రంగరాయలు. తర్వాత పాపారాయుడు "నువ్వు మా వంశాన్ని మొత్తం దొంగ దెబ్బ తీసి చంపావు " అంటూ అతని ఛాతీపై పదేపదే పొడిచి చంపాడు.

అది గమనించి నిర్లక్ష్యంగా ఉన్న రంగరాయలు అంగరక్షకుడు లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించగా ద్వారం వద్ద పెద్దన్న అతన్ని చంపాడు. అప్పుడు మొత్తం సైన్యం అప్రమత్తమైంది. పాపారాయుడు, అతని సహచరులు తమను తాము చంపుకున్నారు, తద్వారా బొబ్బిలి వంశం నాశనం అయింది.




