- Telugu News Photo Gallery Beauty skin care tips ways to add ghee into your face mask for glowing skin in telugu
Ghee: నెయ్యితో ఇలా ఫేస్ ప్యాక్ ట్రై చేయండి… బంగారు వర్ణంలో మెరిసిపోవడం పక్కా..
ఆహారంలో నూనె కంటే నెయ్యి ఎల్లప్పుడూ మంచిదని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే ఆయుర్వేదంలో కూడా నెయ్యి మంచి ఆరోగ్యకరమైన పదార్ధం పిలుస్తారు. నెయ్యి తీసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. నెయ్యితో ఆరోగ్యం మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన, ప్రకాశించే, మచ్చలేని చర్మాన్ని అందించడంలో కూడా సహాయపడుతుంది. నెయ్యిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అలాగే విటమిన్లు A, D, E, K ఉంటాయి. నెయ్యిని ఆహారంలో భాగంగా మాత్రమే కాకుండా.. చర్మానికి అప్లై చేయటం వల్ల కూడా మీరు ఊహించని లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...
Updated on: Jun 01, 2025 | 8:04 AM

ఇంట్లో ఉండే సాధారణ పదార్థలను నెయ్యితో కలిపి ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించుకోవచ్చు. దీనిలో శనగపిండి, నెయ్యి ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని మృదువుగా, తాజాగా మార్చేస్తుంది. రెండు చెంచాల శనగపిండిని రెండు చెంచాల నెయ్యితో కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేసి దాదాపు 30 నిమిషాలు అలాగే ఉంచండి. దీని తరువాత చేతులతో స్మూత్‌గా మసాజ్ చేసుకోవాలి. అరగంట ఆరిన తరువాత ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. క్రమంగా మీ ముఖంలో యవ్వనపు కాంతి పెరుగుతుంది.

Face Pack

మెరిసే, మచ్చలేని చర్మాన్ని పొందడానికి మీరు మీ ముఖానికి పాలతో నెయ్యిని కలిపి అప్లై చేసుకోవచ్చు. దీని కోసం అర టీస్పూన్ నెయ్యి, కొద్దిగా పచ్చి పాలు, 2 టీస్పూన్ల శనగపిండి కలిపి మందపాటి పేస్ట్‌ను తయారు చేసుకోవాలి. మీ ముఖం, మెడకు పూర్తిగా అప్లై చేసుకోవాలి. 15 నిమిషాలు అలాగే ఉంచండి. అది ఆరిన తర్వాత మసాజ్ చేసి చల్లటి నీటితో మీ ముఖాన్ని కడగాలి. మీ ముఖంలోని మచ్చలను తొలగించడానికి, ఈ ప్యాక్‌ను వారానికి 1-2 సార్లు అప్లై చేయండి.

ముఖంలో ట్యాన్ పూర్తిగా తొలగించి మెరిసే చర్మాన్ని పొందడానికి, నెయ్యి, పసుపు కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. నెయ్యి, పసుపు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి చక్కటి ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. దాదాపు 15 నిమిషాల పాటు పూర్తిగా ఆరనివ్వండి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి.

ముఖం మీద మొటిమలు, నల్లటి వలయాలు ఉంటే.. ప్రతిరోజూ నెయ్యితో మీ ముఖాన్ని మసాజ్ చేయడం ప్రారంభించండి. నెయ్యి ఒక సహజ యాంటీఆక్సిడెంట్, ఇది చర్మ సమస్యలను మూలం నుండి తొలగిస్తుంది. కళ్ళ కింద నల్లటి వలయాలు, నల్లటి మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. నెయ్యితో తయారు చేసుకునే ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ ను మీ ముఖం మీద ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా ఈ సమయంలో మీ కళ్ల ప్రాంతంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.




