- Telugu News Photo Gallery The conjunction of Mercury and Saturn brings financial benefits to four zodiac signs
వీరిని చూసి అసూయపడకండి.. జూలైలో నక్కతోక తొక్కే రాశులివే!
రెండు గ్రహాల కలయిక నాలుగు రాశుల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకరాబోతుంది. అంతే కాకుండా, జూలై నెల వస్తూ వస్తూనే వారి జీవితాన్ని ఆనందంతో నింపనుంది. కాగా, అసలు జూలైనెలలో ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jun 29, 2025 | 8:30 AM

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల కలియక సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే గ్రహాల సంచారం కూడా 12 రాశులపై ప్రభావాన్ని చూపెడుతాయి.అయితే గ్రహాల్లో శని గ్రహం, దేవ గురువు బృహస్పతి గ్రహాలు చాలా శక్తివంతమైన గ్రహాలు. అయితే ఈ గ్రహాల సంచారం వలన నాలుగు రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయంట. అదే విధంగా జూలై నెల వస్తూ వస్తూనే వీరికి అదృష్టాన్ని తీసుకొస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

మిథున రాశి : బుధుడు, శని కలయిక వలన మిథున రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా జూలై నెల ప్రారంభం వీరికి కలిసి వస్తుంది. ఏ పని చేసినా వీరు విజయం సాధిస్తారు. ఈ నెలలో రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఆర్థికంగా, ఆరోగ్యం పరంగా చాలా బాగుంటుంది. అంతే కాకుండా చేతినిండా డబ్బుతో చాలా ఆనందంగా గడుపుతారంట.

తుల రాశి : తుల రాశి వారి జీవితంలో జూలై నెల కొత్త వెలుగులను తీసుకొస్తుంది. వీరు అనేక లాభాలు పొందుతారు. శని , బుధుల ప్రభావంతో వీరికి విషేశమైన ప్రయోజనాలు కలగనున్నాయి అంటున్నారు పండితులు. ఆకస్మిక ధన లాభం కలుగుతుందంట. విద్యార్థులకు కలిసి వస్తుంది. వ్యాపారంలో కూడా అనేక లాభాలు పొందుతారు.

వృషభ రాశి : జూలై నెల వృషభ రాశి వ్యాపారస్తులకు అద్భుతమైన నెల. ఈ నెలలో వీరు అనేక లాభాలను పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తాయి. ఇవి వీరి వ్యాపార పురోగతికి ఎంతగానో దోహదం చేస్తాయి. అంతే కాకుండా వీరు ఏ పని చేసినా వారికి అందులో పట్టిందల్లా బంగారమే కానుంది. ఇక నిరుద్యోగులు ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంది.

ధనస్సు రాశి : శని, బుధుల కలయిక ధనస్సు రాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కలిసి వస్తుంది. వీరు తమ జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభించనున్నారు. వీరికి చాలా కాలంగా వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగులకు అద్భుతంగా ఉంటుంది. ఏ పని చేసినా విజయం వీరిదే అవుతుంది.



