- Telugu News Photo Gallery Technology photos Xiaomi offering discounts on smartphones and tvs for this diwali festival Diwali with MI
Xiaomi Diwali: వినియోగదారులకు షావోమీ దీపావళి ఆఫర్లు.. వేటిపై ఎంత డిస్కౌంట్‌లు ఉన్నాయంటే..
Xiaomi Diwali Offer: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం షావోమీ తాజాగా దీపావళి పండుగ సందర్భంగా స్మార్ట్ ఫోన్‌లతో పాటు ఇతర గ్యాడ్జెట్స్‌పై ఆఫర్లు ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా కొన్ని ప్రాడక్ట్స్‌పై ఏకంగా రూ. 5000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది..
Narender Vaitla | Edited By: Ravi Kiran
Updated on: Oct 30, 2021 | 6:44 AM

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం షావోమీ దీపావళి కానుకగా వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా పలు గ్యాడ్జెట్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఏయో ప్రొడక్ట్‌లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దీపావళి సేల్‌లో భాగంగా రెడ్‌మీ స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో భాగంగా రెడ్ మీ నోట్ 10 సిరీస్, రెడ్ మీ 9 సిరీస్ లాంటి మోడళ్లపై రూ.1000ల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే రెడ్ మీ నోట్ 10 ఎస్‌పై కూడా రూ. 1000 డిస్కౌంట్ అందిస్తోంది.

షావోమీ దీపావళి సందర్భంగా స్మార్ట్ టీవీలపై కూడా భారీగా డిస్కౌంట్‌లు అందిస్తోంది. ఇందులో భాగంగా రెడ్ మీ స్మార్ట్ టీవీ ఎక్స్ మోడల్ పై రూ.3000 నుంచి రూ.5000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే ఎంఐ టీవీలపై రూ. 1000 నుంచి రూ. 3000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది.

ఇక సేల్‌లో భాగంగా ఎమ్‌ఐ వాట్రివాల్వ్ యాక్టివ్‌పై రూ. 2000, ఎమ్‌ఐ రోబోట్వాక్యుమ్పై రూ. 5000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

ఎమ్‌ఐ 11 ఎక్స్ స్మార్ట్ ఫోన్‌పై కూడా డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఫోన్‌పై గరిష్టంగా రూ. 3000 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.





























