Narender Vaitla |
Updated on: Feb 12, 2023 | 9:21 PM
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోంది. షియోమీ 13 ప్రో పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్‌ను ఫిబ్రవరి 26వ తేదీన లాంచ్ చేయనున్నారు.
ఇటీవల తక్కువ బడ్జెట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వచ్చిన షియోమీ తాజాగా ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తోంది. చైనాలో ఈ ఫోన్ మన కర్సెనీలో రూ. 61,000గా ఉంది. అయితే భారత్‌లో మాత్రం ఇంత కంటే తక్కువే లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
షియోమీ 13 ప్రో ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.73 ఇంచెస్ 2కే ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC ద్వారా పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తున్నారు.
కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. ప్రత్యేకంగా X-యాక్సిస్ లీనియర్ మోటార్, లేజర్ ఫోకస్ సెన్సార్, IR కంట్రోల్ సెన్సార్ ఇవ్వనున్నారు.
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 4820 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. 120W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీని అందించారు. IP68 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెంట్స్ అందించారు.