- Telugu News Photo Gallery Technology photos Infinix launches new smart phone infinix zero 5g 2023 features and price details Telugu Tech News
Infinix Zero 5G: భారీ బ్యాటరీ, అదిరిపోయే కెమెరా.. భారత మార్కెట్లోకి ఇన్‌ఫినిక్స్ కొత్త స్మార్ట్ ఫోన్.
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఇన్‌ఫినిక్స్ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇన్‌ఫినిక్స్ జీరో 5జీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు..
Updated on: Feb 13, 2023 | 11:27 AM

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఇన్‌ఫినిక్స్ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇన్‌ఫినిక్స్ జీరో పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ అందుబాటులోకి వచ్చింది.

ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో రెండు వేరియంట్లను తీసుకొచ్చారు. వెనిలా Infinix Zero 5G 2023, Infinix Zero 5G 2023 Turbo ఎడిషన్ పేరుతో తీసుకొచ్చారు.

వెనిలా ఇన్‌ఫినిక్స్ జీరో 5జీ 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 17,999. ఇన్‌ఫినిక్స్ జీరో 5జీ టర్బో 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999గా ఉంది.

ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్ ఫూల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో MediaTek డైమెన్సిటీ 920 5G SoC ప్రాసెసర్‌ను అందించారు.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.





























