- Telugu News Photo Gallery Technology photos Whatsapp testing in app dialer feature check here for full details
WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ సమస్యకు చెక్
వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న వారికి ఈ యాప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఉపయోగిస్తున్న ఏకైక మెసేజింగ్ యాప్ వాట్స్‌కు మాములు క్రేజ్ లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే వాట్సాప్ యూజర్లు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే వాట్సాప్‌లో తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు..
Updated on: Jun 24, 2024 | 9:25 PM

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. సాధారణంగా వాట్సాప్ ఉపయోగించే సమయంలో ఎవరికైనా ఫోన్ కాల్ చేయాలంటే యాప్‌ను బయటకు వచ్చి డైలర్ ఓపెన్ చేసి కాల్ చేయాల్సి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే.

అయితే ఇకపై వాట్సాప్‌ను క్లోజ్ చేయకుండానే నార్మల్ కాల్స్ చేసుకునే అవకాశం లభించనుంది. ఇందుకోసమే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. ‘ఇన్-యాప్ డయలర్ ఫీచర్’ని తీసుకొచ్చేందుకు వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది.

త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ కొత్త ఫీచర్ సహాయంతో ఇకపై ఎవరికైనా కాల్ చేయాలంటే వాట్సాప్ యాప్ నుంచి ఎగ్జిట్ కావాల్సిన అవసరం ఉండదు. నేరుగా వాట్సప్ నుంచే కాల్స్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆండ్రాయిడ్ 2.24.13.17 అప్‌డేటెడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉందని WABetaInfo పేర్కొంది.

వాట్సాప్‌లో కుడిపైపు దిగువన కొత్త ఫ్లోటింగ్ యాక్షన్ బటన్‌ను తీసుకురానున్నారని దీనికి యాక్సెస్ ఇస్తే కాల్స్ సులభంగా చేసుకోవచ్చునని వాట్సప్‌బీటా ఇన్ఫో తెలిపింది.

కాలింగ్‌తో పాటు మెసేజింగ్ షార్ట్‌కట్ డయలర్ స్క్రీన్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.




