- Telugu News Photo Gallery Technology photos Vivo launching new foldable smartphone in india Vivo X Fold 3 Pro features and price details
Vivo X Fold3 Pro: భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్న మరో ఫోల్డబుల్ ఫోన్.. వివో నుంచి..
స్మార్ట్ ఫోన్ తయారీలో రోజురోజుకీ విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం ఫోల్డబుల్ ఫోన్‌లకు గిరాకీ పెరుగుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే అన్ని ప్రధాన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ఫోల్డబుల్ ఫోన్‌లను తీసుకొచ్చాయి. తాజాగా వివో భారత్‌లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: May 21, 2024 | 10:11 AM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో.. వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో పేరుతో ఇప్పటికే చైనాలో ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకురాగా ఈ ప్రొడక్ట్‌కు మంచి ఆదరణ లభించింది. అయితే తాజాగా ఈ ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. అయితే ఈ ఫోన్ వచ్చే నెల చివరి నాటికి భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించనున్నారు. జెయిస్ ఆప్టిక్స్ ట్యూన్‌డ్ కెమెరాను ఇందులో ప్రత్యేకంగా అందింఆచరు. అంతకుముందు వివో ఎక్స్100లో ఇదే టెక్నాలజీని అందించారు.

వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 8.03 ఇంచెస్‌తో కూడిన ప్రైమరీ 2కే అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. అలాగే ఇందులో 6.53 ఇంచెస్‌తో కూడిన సెకండరీ డిస్‌ప్లేను ఇచ్చారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ సొంతం.

ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 16 జీబీ ర్యామ్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.




