Vivo Y200: లాంచింగ్‌కు సిద్ధమైన వివో నయా ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్స్‌..

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి సరికొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. మిడ్ రేంజ్‌ బడ్జెట్‌ను టార్గెట్‌ చేసుకొని ఈ ఫోన్‌ను తెస్తున్నారు. వివో వై200 పేరుతో తీసుకొస్తున్న ఈ కొత్త స్మార్ట్ ఫోన్‌ను మే21వ తేదీన (ఈరోజు) లాంచ్‌ చేయనున్నారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: May 21, 2024 | 10:48 AM

వివో వై200 పేరుతో సరికొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్ల గురించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పకిటీ నెట్టింట్లో కొన్ని ఫీచర్లు వైరల్‌ అవుతున్నాయి.

1 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 3డీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లేను అందించనున్నారని సమచారం. స్మూత్, వాటర్‌పాల్‌ లైక్‌ స్క్రీన్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో పాటు 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్ స్క్రీన్‌ ఈ ఫోన్‌ సొంతం.

2 / 5
ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ కెపాసిటీని అందించనున్నారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేయనుంది.

3 / 5
ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 25,000లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇవ్వనున్నారని తెలుస్తోంది.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్స్‌, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్‌ రెయిర్‌ కెమెరా సెటప్‌ను ఇవ్వనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారని సమాచారం

5 / 5
Follow us