- Telugu News Photo Gallery Technology photos These are the popular brands of smart TVs available on Amazon, check details in telugu
Smart TVs: ఇంటిని సినిమా థియేటర్‌లా మార్చుకోవాలా..? ఈ టీవీలతో సాధ్యమే..!
ఇంటికి అవసరమైన, అందాన్నిచ్చే వస్తువుల్లో టీవీకి మొదటి స్థానం ఉంటుంది. అందుకే దాన్నికొనుగోలు చేసేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు, బ్రాండ్, నాణ్యత, పనితీరు, పిక్చర్ క్వాలిటీ, సౌండ్ .. ఇలా అనేక అంశాలను గమనిస్తారు. ఆధునిక కాలంలో పెరిగిన టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. లేటెస్ట్ ఫీచర్లు, సౌండ్, విజువల్స్ తో ఆకట్టుకుంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇంటిలో కూర్చుని థియేటర్ లో సినిమా చూసిన అనుభవం పొందవచ్చు. ఈ నేపథ్యంలో అమెజాన్ లో ప్రముఖ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ టీవీలు తక్కువ ధరకు లభిస్తున్నాయి. వాటి ప్రత్యేకతలు, ధర, ఇతర వివరాలను తెలుసుకుందాం.
Updated on: Jun 01, 2025 | 6:50 PM

ఇంటికి అందాన్నివ్వడంతో పాటు అద్భుతమైన పనితీరు కనబర్చడం షియోమి 138 సెం.మీ (55 అంగుళాల) ఎక్స్ సిరీస్ 4కే ఎల్ ఈడీ స్మార్ట్ టీవీ ప్రత్యేకత. స్పష్టమైన స్క్రీన్, మంచి ఆడియో నాణ్యత, విభిన్న వైర్లు, వైర్ లెస్ కనెక్టివిటీ ఫీచర్లు బాగున్నాయి. ఇతర పరికరాలకు చాలా సులభంగా కనెక్టివీటి చేసుకోవచ్చు. అన్ని రకాల యాప్ లను యాక్సెస్ చేసుకునే వీలు, 30 వాట్స్ స్పీకర్లు, డాల్బీ ఆట్మోస్ టెక్నాలజీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. అమెజాన్ లో రూ.39,999 ధరకు ఈ స్మార్ట్ టీవీ అందుబాటులోకి ఉంది.

ప్రముఖ బ్రాండ్ సామ్సంగ్ నుంచి విడుదలైన 108 సెం.మీ (43 అంగుళాలు) స్మార్ట్ టీవీ ఆధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. అధిక బ్రైట్ నెస్ తో చిత్ర నాణ్యత చాలా మెరుగ్గా ఉంటుంది. క్యూ సింఫనీ టెక్నాలజీ, శక్తివంతమైన స్పీకర్లతో ఆడియో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మోషన్ ఎక్స్ సెలరేటర్ కారణంగా చిత్ర నాణ్యత థియేటర్ లో మాదిరిగా ఉంటుంది. 4కే అప్ స్కేలింగ్, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్, సులభమైన కనెక్టివిటీ అదనపు ప్రత్యేకతలు. ఈ టీవీ కేవలం రూ.29,990 ధరకు అమెజాన్ లో అందుబాటులో ఉంది.

ఫ్రేమ్ లెస్ డిజైన్, డాల్బీ విజన్, హై స్పీడ్ ప్రాసెసర్, అత్యుత్తమ చిత్ర నాణ్యత తదితర ప్రత్యేకతలతో ఏసర్ 126 సెం.మీ (50 అంగుళాల) ఐప్రో సిరీస్ టీవీ ఆకట్టుకుంటోంది. దీనిలోని 4కే టెక్నాలజీతో మీకు ఇష్టమైన కంటెంట్ ను స్పష్టంగా వీక్షించొచ్చు. డాల్బీ అట్మాస్, డాల్బీ డిజిటల్ కారణంగా ఆడియో బ్రహ్మాండంగా వినిపిస్తుంది. ఆరు రకాల సౌండ్ మోడ్ లు, హెచ్ డీఎంఐ, యూఎస్ బీ పోర్టులు, ఇయర్ ఫోన్ జాక్, ఆప్టికల్ పోర్టు తదితర వాటిని ఏర్పాటు చేశారు. ఏసర్ స్మార్ట్ టీవీ రూ.27,999 ధరకు అమెజాన్ లో అందుబాటులో ఉంది.

అద్భుతమైన విజువల్స్ అందించే స్మార్ట్ టీవీలలో హైయర్ 127 సెం.మీ (50 అంగుళాలు) టీవీ ముందుంటుంది. దీనిలోని హెచ్ఢీఆర్10, అల్ట్రా హెచ్ డీ మోడ్ లు చక్కని స్పష్టత అందిస్తాయి. హై ఎండ్ గ్రాఫిక్స్ కారణంగా విజువల్స్ తో థియేటర్ లో సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. ఈ 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ గూగుల్ అసిస్టెంట్ కు మద్దతు ఇస్తుంది. తద్వారా వాయిస్ కమాండ్ లను అర్థం చేసుకుంటుంది. అన్ని ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సేవలను పొందవచ్చు. అమెజాన్ లో రూ.38,990కు ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు.

గదిలోని ఏ మూల నుంచి చూసినా స్పష్టమైన విజువల్ కనిపించేలా 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ ఏంజెల్ టెక్నాలజీతో తోషిబా 126 సెం.మీ (50 అంగుళాల) సీ350ఎన్పీ సిరీస్ టీవీ అందుబాటులోకి వచ్చింది. వాయిస్ కమాండ్ తో చాలా సులువుగా నియంత్రణ చేయవచ్చు. డాల్బీ అట్మాస్, డాల్బీ డిజిటల్ తో ఆడియో చాలా స్పష్టంగా ఉంటుంది. వివిధ కంటెంట్ లను చూసినప్పుడు మనకు నచ్చిన విధంగా ఆరు రకాల సౌండ్ మోడ్ లను ఎంపిక చేసుకోవచ్చు. హెచ్ డీఎంఐ, యూఎస్ బీ పోర్టులతో పాటు ఇయర్ ఫోన్ జాక్, మల్టీ డైరెక్షన్ కనెక్టివిటీ కోసం ఆఫ్టికల్ పోర్టుతో ఆకట్టుకుంటోంది. అమెజాన్ లో రూ.28,999కు ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు.




