- Telugu News Photo Gallery Technology photos These are the popular brands of smartwatches available on Amazon, check details in telugu
Best smart watches: ఈ స్మార్ట్ వాచ్ లు చిన్నసైజు డాక్టర్లే.. అదిరిపోయే ఫీచర్లతో విడుదల
ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఆరోగ్యంతో ఉన్నవ్యక్తి అందరికన్నా గొప్పవాడు అని దీని అర్థం. గతంలో దాదాపు 60 ఏళ్లు దాటిన వారు కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు 30 ఏళ్లకే అన్ని రోగాలు దాడి చేస్తున్నాయి. మారిన జీవన విధానం, తినే ఆహారం, రాత్రి పూట ఉద్యోగాలు తదితర అనేక కారణాలు దీని వెనుక ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణకు అందరూ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ప్రక్రియలో స్మార్ట్ వాచ్ లు కీలకంగా మారుతున్నాయి. వీటి ద్వారా ఆరోగ్యం, వ్యాయామాలను ట్రాకింగ్ చేసుకోవచ్చు. సమయం చూసుకోవడంతో పాటు కాల్స్ చేసుకోవచ్చు, మెసేజ్ లకు బదులు ఇవ్వొచ్చు. మ్యూజిక్ వినొచ్చు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లో తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ వాచ్ లు, వాటి ధర, ప్రత్యేకతలను తెలుసుకుందాం.
Updated on: Jun 01, 2025 | 6:15 PM

ఆధునిక ఫీచర్లతో పాటు సౌకర్యవంతంగా ధరించే వీలుండడం అమాజ్ ఫిట్ బిప్ 6 వాచ్ ప్రత్యేకత. ఆరోగ్య సంరక్షణ, వ్యాయామం కోసం అనేక ఫీచర్లు దీనిలో ఉన్నాయి. గుండె స్పందన రేటు, రక్త ఆక్సిజన్ ట్రాకింగ్, ఒత్తిడి స్తాయి, నిద్ర తదితర వాటిని ట్రాకింగ్ చేసుకోవచ్చు. కచ్చితమైన జీపీఎస్ ట్రాకింగ్ తో నావిగేషన్ కు చాలా సులభంగా యాక్సెస్ లభిస్తుంది. ఎక్కువ కాలం బ్యాటరీ అదనపు ప్రత్యేకత. కేవలం 40.8 గ్రాముల బరువు, 512 ఎంజీ మెమరీ, 1.97 అంగుళాల డిస్ ప్లే అదనపు ప్రత్యేకతలు. ఈ వాచ్ రూ.7,999కి అమెజాన్ లో అందుబాటులో ఉంది.

పురుషుల చేతికి అందాన్నిచ్చే స్మార్ట్ వాచ్ లలో బోట్ లునార్ డిస్కవరీ ముందుంటుంది. చెమట, దుమ్ము నుంచి రక్షణకు దీనిలో ప్రత్యేక టెక్నాలజీ ఉంది. దీంతో పాడైపోతుందనే ఆలోచన లేకుండా చక్కగా వినియోగించుకోవచ్చు. ఎనర్జీ స్కోర్ అప్ డేట్లు, స్లీప్ మానిటరింగ్, హార్ట్, ఎస్పీవో2 మానిటరింగ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. కెమెరా నియంత్రణ, స్టాప్ వాచ్, టైమర్, మ్యూజిక్ కంట్రోలు అదనపు ప్రత్యేకతలు. టర్న్ బై టర్న్ నావిగేషన్, 700 ప్లస్ యాక్టివ్ మోడ్ లు, హెచ్ డీ డిస్ ప్లే బాగున్నాయి. అమెజాన్ లో రూ.1,299కు ఈ వాచ్ అందుబాటులో ఉంది.

ప్రముఖ బ్రాండ్ ఫాస్ట్రాక్ నుంచి విడుదలైన న్యూ ఆస్టర్ ఎఫ్ఎస్ఐ ప్రో స్టార్ట్ వాచ్ లేటెస్ట్ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఆరోగ్య పర్యవేక్షణ, ఫిట్ నెస్ అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది. 60 హెర్డ్జ్ ఫ్లూయిడ్ డిస్ ప్లే తో విజువల్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. హైడ్రేషన్ హెచ్చరికలు, ఒత్తిడి స్థాయి పర్యవేక్షణ, గుండె పనితీరు, ఐపీ 68 రేటింగ్, ఐదు రోజుల బ్యాటరీ సామర్థ్యం అదనపు ప్రత్యేకతలు. అమెజాన్ లో రూ.2299 ధరకు ఈ వాచ్ కు అందుబాటులో ఉంది.

అదిరిపోయే లుక్ తో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అనేక ఫీచర్లు ఫైర్ బోల్ట్ టాక్ స్మార్ట్ వాచ్ లో ఉన్నాయి. 120కి పైగా స్పోర్ట్ మోడ్ లతో స్ప్రింటింగ్, జాగింగ్, స్విమ్మింగ్ తదితర వాటిని ట్రాకింగ్ చేసుకోవచ్చు. హెల్త్ అసిస్టెంట్ ఫీచర్ తో బ్లడ్ ఆక్సిజన్, హార్ట్ బీట్, సీప్ మానిటరింగ్ తదితర వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవచ్చు. వాయిస్ కమాండ్, ఐపీ 67 నీటి నిరోధకత, ఎల్సీడీ డిస్ ప్లే, ఎక్కువ రోజులు పనిచేసే బ్యాటరీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. అమెజాన్ లో ఈ వాచ్ ను రూ.1,199కి కొనుగోలు చేసుకోవచ్చు.

మణికట్టుకు అందాన్నిచ్చే పెద్ద సైజు డయల్ తో నాయిస్ హలో ప్లస్ స్మార్ట్ వాచ్ ఆకట్టుకుంటోంది. దీనిలో 300 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. రెండు గంటల్లో బ్యాటరీని పూర్తిగా చార్జింగ్ చేయవచ్చు. ట్రూ సింక్ టీఎం ఫీచర్ బ్లూటూత్ ఫీచర్ ద్వారా వ్యాల్యూమ్ సర్దుబాటు, కాల్స్ ను సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. డిస్ ప్లే ప్యానల్ ను నచ్చిన విధంగా మార్చుకునే వీలుంది. వాతావరణ హెచ్చరికలు, కాలిక్యులేటర్, అలారం సెట్టింగ్ లు, ట్రైమర్, స్టాప్ వాచ్, హెల్తా ట్రాకింగ్, ఆరోగ్య పర్యవేక్షణ ఫీచర్లు ఉన్నాయి. అమెజాన్ లో రూ.2,799కి ఈ వాచ్ ను కొనుగోలు చేయవచ్చు.




