బీఎస్ఎన్ఎల్ 4జీ, 5జీ సేవల కోసం దేశవ్యాప్తంగా 1.12 లక్షల టవర్లను ఏర్పాటు చేయనుంది. కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా 9 వేల 4జీ సర్వీస్ టవర్లను ఏర్పాటు చేసింది. ఇందులో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ యుపీ, హర్యానా సర్కిళ్లలో 6 వేలకు పైగా టవర్లు ఏర్పాటు అయ్యాయి. పాత సిమ్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు కొత్త నెట్‌వర్క్ నుండి ప్రయోజనం పొంలేరు. దీని కోసం కంపెనీ సిమ్ కార్డును కూడా మారుస్తోంది. అయితే, BSNL గత కొన్ని సంవత్సరాలుగా 4G సేవలను సపోర్ట్ చేసే సిమ్‌లను అందిస్తోంది.